వాట్సాప్‌లో ఈపీఎఫ్‌వో సేవలు

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తమ చందాదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా చందాదారులు తమ సమస్యలను సులువుగా పరిష్కరించేందుకు వీలుగా వాట్సాప్...

Updated : 03 Mar 2021 17:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తమ చందాదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా చందాదారులు తమ సమస్యలను సులువుగా పరిష్కరించేందుకు వీలుగా వాట్సాప్‌ హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పీఎఫ్‌ చందాదారులు చిన్న చిన్న పనులకూ ఈపీఎఫ్‌వో కార్యాలయాలకు వెళ్లకుండా ఈ సదుపాయం కల్పించింది. ఇందుకోసం ఒక్కో ప్రాంతీయ కార్యాలయానికి ఒక్కో నంబర్‌ను కేటాయించింది. మీ ప్రాంతీయ కార్యాలయం నంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్‌ చేసుకుని, వాట్సాప్‌ ద్వారా సేవలను పొందొచ్చు. ఇప్పటికే సమస్యల పరిష్కారానికి EPFiGMS, CPGRAMS పేరిట రెండు పోర్టళ్లు ఉన్నాయి. 24 గంటల కాల్‌సెంటర్‌ కూడా అందుబాటులో ఉంది. వీటికి అదనంగా వాట్సాప్‌ సేవలను ఈపీఎఫ్‌వో తీసుకొచ్చింది.

తెలంగాణ

హైదరాబాద్‌ (బర్కత్‌పుర): 91000 26170

హైదరాబాద్‌ (మాదాపూర్‌): 91000 26146

కరీంనగర్‌: 94924 29685

కూకట్‌పల్లి: 93923 69549

నిజామాబాద్‌: 89190 90653

పఠాన్‌చెరు: 94941 82174

సిద్దిపేట్‌: 96032 62989

వరంగల్‌: 87024 47772

ఏపీ

గుంటూరు: 0863-2344123

కడప: 94911 38297

రాజమహేంద్రవరం: 9494633563

విశాఖపట్నం: 73823 96602

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని