EPFO: అధిక రాబడికి ఈపీఎఫ్‌వో కొత్త మార్గం..5% పెట్టుబడులు ఆ ఫండ్లలోకి!

ఈపీఎఫ్‌ఓ వార్షిక డిపాజిట్లలో ఐదు శాతం నిధుల్ని ఇన్విట్స్‌(InvITs) వంటి ‘ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్ల(AIFs)’లో మదుపు చేయాలని సీబీటీ నిర్ణయించింది...

Published : 20 Nov 2021 19:36 IST

దిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ)కు చెందిన అత్యున్నత నిర్ణాయక మండలి ‘సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌(సీబీటీ)’ కీలక నిర్ణయం తీసుకుంది. వార్షిక డిపాజిట్లలో ఐదు శాతం నిధుల్ని ఇన్విట్స్‌(InvITs) వంటి ‘ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్ల(AIFs)’లో మదుపు చేయాలని నిర్ణయించింది. దీంతో ఈపీఎఫ్‌ఓ పెట్టుబడుల్లో డైవర్సికేషన్‌ ఏర్పడి రాబడి పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో నష్టభయం సైతం ఎక్కువవుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ప్రభుత్వ మద్దతు ఉన్న పబ్లిక్‌ సెక్టార్‌ ఇన్విట్స్‌, బాండ్లలో మాత్రమే పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.

ఇప్పటి వరకు ఈపీఎఫ్‌ఓ ‘ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల(ఈటీఎఫ్‌)’లలో మాత్రమే పెట్టుబడి పెట్టింది. 2020-21లో ఈక్విటీల్లో రూ.31,025 కోట్లు, 2019-20లో రూ.32,377 కోట్లు, 2018-19లో రూ.27,743 కోట్లు మదుపు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏఐఎఫ్‌లలోనూ పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో అధిక రాబడినిచ్చే ప్రభుత్వ ఇన్విట్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఈపీఎఫ్‌ఓ సిద్ధమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని