
Edible oil prices: డిసెంబరు నుంచి వంటనూనె ధరల్లో తగ్గుదల!
కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అంచనా
దిల్లీ: వచ్చే డిసెంబరు నుంచి వంటనూనెల ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే తెలిపారు. ఇప్పుడు సాగులో ఉన్న పంటలు చేతికి రానున్న నేపథ్యంలో అప్పటికల్లా అంతర్జాతీయంగా నూనె ధరలు తగ్గుతాయని అంచనా వేశారు. ఇప్పటికే డిసెంబర్ ఫ్యూచర్ మార్కెట్లో వంట నూనెల రేట్లు తగ్గాయని తెలిపారు. అయితే, గిరాకీ ఇంకా భారీ స్థాయిలోనే ఉన్న నేపథ్యంలో తగ్గింపు భారీ స్థాయిలో ఉండకపోవచ్చునని పేర్కొన్నారు.
దేశీయంగా వంటనూనెల ధరలు పెరగడానికి గల కారణాలను పాండే వివరించారు. నూనె గింజల పంట సాగు అధికంగా ఉన్న దేశాల్లో బయోఫ్యూయల్ పాలసీలు తీసుకురావడం ధరలపై ఒత్తిడి పెంచిందని పేర్కొన్నారు. పామాయిల్ పంట అధికంగా పండే మలేషియా, ఇండోనేషియా దేశాలు పామాయిల్‌ను బయోఫ్యూయల్‌గా వినియోగించాలని నిర్ణయించాయి. అలాగే అమెరికా సోయాబీన్‌ను బయోఫ్యూయల్ తయారీలో వినియోగిస్తోంది. భారత మార్కెట్లో పామాయిల్‌ది 30-31 శాతం వాటా కాగా.. సోయాబీన్ ఆయిల్ మార్కెట్ వాటా 22 శాతంగా ఉంది. దేశీయ వంటనూనెల అవసరాల్లో దాదాపు 60 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుండడం గమనార్హం. మరో ముఖ్యకారణం చైనా నుంచి అధిక మొత్తంలో నూనెలను కొనుగోలు చేయడమని పాండే తెలిపారు.
అయితే, ప్రభుత్వ చొరవ వల్ల అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల ప్రభావం పూర్తిగా భారత్‌పై పడలేదని పాండే తెలిపారు. ప్రపంచ విపణిలో సోయాబీన్ నూనె ధర 18 శాతం, పామాయిల్ ధర 22 శాతం పెరిగితే.. భారత్‌లో మాత్రం ఈ పెరుగుదల 2 శాతానికే పరిమితమైందన్నారు. దిగుమతి సుంకాల్ని తగ్గించడం వంటి చర్యలతో సర్కార్ ధరల్ని నియంత్రించే ప్రయత్నం చేసిందన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. గత ఏడాది కాలంలో కిలో పామాయిల్ ధర 64 శాతం పెరిగి రూ.139, సోయాబీన్ ధర 51.21 శాతం ఎగబాకి 155కి పెరిగింది. కిలో సన్‌ఫ్లవర్ నూనె ధర 46 శాతం పెరిగి 175కు చేరింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
TS TET: టెట్ పేపర్-2లో ఉత్తీర్ణత డబుల్
-
Related-stories News
Child Marriages: వచ్చే పదేళ్లలో కోటి మందికి బాల్యవివాహాలు
-
Viral-videos News
Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
-
Related-stories News
Corona: ‘దక్షిణ’ బెలూన్లే కరోనాను మోసుకొచ్చాయి
-
Related-stories News
Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- Andhra News: నా చొక్కా, ప్యాంట్ తీసేయించి మోకాళ్లపై కూర్చోమన్నారు.. సాంబశివరావు ఆవేదన