EV: తగ్గనున్న ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ ధరలు

పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఊతమిచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ట్ టూవీలర్‌ తయారీదారులకు అందించే సబ్సిడీనీ

Published : 12 Jun 2021 19:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఊతమిచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ తయారీదారులకు అందించే సబ్సిడీనీ పెంచింది. ఇందుకోసం ఫేమ్‌- 2 (Faster Adoption and Manufacturing of Electric Vehicles in India Phase II) పథకంలోని కొన్ని సవరణలు చేసింది. ఈ మేరకు భారీ పరిశ్రమల శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఎలక్ట్రిక్‌ వాహన తయారీదారులకు ప్రస్తుతం 1KWhకు ₹10వేలు చొప్పున ఇస్తున్న సబ్సిడీని ₹15 వేలకు పెంచుతున్నట్లు కేంద్రం పేర్కొంది. వాహనం ఖరీదులో గరిష్ఠంగా 40 శాతం వరకూ ఈ ప్రోత్సాహకాలను అందించనున్నారు. గతంలో ఇది 20 శాతం మాత్రమే ఉండేది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థలు సంతోషం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తుందని పేర్కొన్నాయి.

ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వెలువడిన వెంటనే బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ వాహనాల ధరలను తగ్గించింది. తన 450x మోడల్‌పై ఏకంగా ₹14,500 తగ్గించింది. మిగిలిన స్కూటర్ల ధరలను కూడా సవరించనుంది. మిగిలిన కంపెనీలు కూడా ఆ మేరకు ధరలు తగ్గించే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు అందుబాటులోకి వస్తే ఈ వాహనాలకు డిమాండ్‌ ఏర్పడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని