సరఫరా సేవలకు విద్యుత్‌ వాహనాలు

వినియోగదారులకు డెలివరీలు అందించేందుకు వీలుగా విద్యుత్‌ వాహనాలను వినియోగించనున్నట్లు మహీంద్రా లాజిస్టిక్స్‌ తెలిపింది.

Updated : 01 Jan 2021 16:32 IST

మహీంద్రా లాజిస్టిక్స్‌ ప్రణాళిక

ముంబయి: వినియోగదారులకు డెలివరీలు అందించేందుకు వీలుగా విద్యుత్‌ వాహనాలను వినియోగించనున్నట్లు మహీంద్రా లాజిస్టిక్స్‌ తెలిపింది. 2025-26 నాటికి రూ.10,000 కోట్ల టర్నోవర్‌ను సంస్థ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి విదితమే. ఇప్పటికే ఇకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా తమ కొనగోలుదార్లకు వస్తువుల సరఫరాకు విద్యుత్తు వాహనాలు వినియోగించాలని నిర్ణయించింది. ఇందు కోసం మహీంద్రా ఎలక్ట్రిక్‌, కైనెటిక్‌ గ్రీన్‌ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది.  ఫర్నీచర్‌ రిటైలర్‌ ఐకియా (గతి లాజిస్టిక్స్‌ ద్వారా), గ్రోసరీల సంస్థ బిగ్‌బాస్కెట్‌ కూడా ఉత్పత్తుల సరఫరాకు విద్యుత్‌ వాహనాల వినియోగానికి సిద్ధమవుతున్న తరుణంలో మహీంద్రా లాజిస్టిక్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే రెండేళ్లలో ఏడాదికి 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో  గోదాములను నిర్మిస్తామని, ఒక్కో గోదాము 4-5 లక్షల చదరపు అడుగులతో ఉంటుందని కంపెనీ ఎండీ, సీఈఓ రామ్‌ప్రవీణ్‌ స్వామినాధన్‌ తెలిపారు. ప్రస్తుతం కంపెనీ చేతిలో 16 మిలియన్‌ చదరపు అడుగుల స్థలం ఉంది. ఒక్క మూడో త్రైమాసికంలోనే హైదరాబాద్‌, చెన్నైల్లో 0.75 మి.చదరపు అడుగుల స్థలాన్ని పెంచుకుంది. కొత్త సేవలు ప్రారంభించడం, ప్రస్తుత విభాగాల సామర్థ్యం పెంచనున్నట్లు రామ్‌ప్రవీణ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు