Elon Musk: రెండు రోజుల్లో 50బిలియన్‌ డాలర్ల నష్టం

ఇంటర్నెట్‌డెస్క్‌: టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ ఆస్తి రెండు రోజుల్లో 50 బిలియన్‌ డాలర్లు కరిగిపోయింది. గత రెండురోజుల్లో టెస్లా షేర్లు వరుసగా పతనం అవుతున్నాయి. బ్లూమ్‌ బెర్గ్‌ బిలియనీర్ల ఇండెక్స్‌ చరిత్రలోనే అతిపెద్ద రెండు రోజుల పతనంగా నమోదైంది. గతంలో జెఫ్‌ బెజోస్‌ ఒక్కరోజులో 36 బిలియన్‌ డాలర్లు కోల్పోవడమే రికార్డు. అప్పట్లో బెజోస్‌ విడాకుల వార్త బయటకు రావడంతో అమెజాన్‌ షేర్లు పతనం అయ్యాయి. 

టెస్లా షేర్ల పతనానికి మస్క్‌ ట్వీట్లు కూడా ఓ కారణమే. పన్ను చెల్లింపు కోసం పదిశాతం షేర్లు విక్రయించాలా.. వద్దా అన్న అంశంపై మస్క్‌ ఇటీవల ట్విటర్‌ పోల్‌ నిర్వహించారు. దీనిలో ఆయన ఫాలోవర్లు షేర్ల విక్రయానికే ఓటు వేశారు. దీనికి తోడు ఈ పోల్‌ పెట్టడానికి ముందే మస్క్‌ సోదరుడు కింబల్‌ టెస్లాలోని వాటాలను విక్రయించేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో టెస్లా షేర్ల ధర పతనమైంది. 

షేరు ధర ఇంతలా పతనం అయినా తర్వాత లెక్కగట్టినా.. ఈ ఏడాది మస్క్‌ సంపద వృద్ధి 70శాతం వరకు ఉంది. టెస్లా ఆదాయాల్లో బలమైన వృద్ధి, కార్ల డెలివరీలు పెరగడం, స్పేస్‌ఎక్స్‌కు అత్యధిక విలువ లభించడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. టెస్లా మార్కెట్‌ విలువ ఈ ఏడాది ట్రలియన్‌ డాలర్లను దాటేసింది. 

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని