Organised sector jobs: తొమ్మిది కీలక రంగాల్లో 3.08 కోట్ల ఉద్యోగులు!
ఎంపిక చేసిన తొమ్మిది వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగాల సంఖ్య ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి 3.08 కోట్లకు చేరినట్లు కేంద్రం తెలిసింది....
కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ నివేదిక
దిల్లీ : ఎంపిక చేసిన తొమ్మిది వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగాల సంఖ్య ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి 3.08 కోట్లకు చేరినట్లు కేంద్రం తెలిసింది. ఈ జాబితాలో నిర్మాణం, ఉత్పత్తి, ఐటీ/బీపీఓ, వాణిజ్యం, రవాణా, విద్య, వైద్యం, ఆతిథ్యం-రెస్టారెంట్, ఆర్థిక సేవల రంగాలు ఉన్నాయి. 2013-14 ఆర్థిక గణాంకాలతో పోలిస్తే ఈ రంగాల్లో ఉద్యోగాల సంఖ్య ఏటా దాదాపు 4 శాతం చొప్పున పెరిగాయి. మొత్తం ఏడు సంవత్సరాల్లో 29 శాతం వృద్ధి నమోదైంది. దీనికి సంబంధించిన నివేదికను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ‘ఆల్-ఇండియా క్వార్టర్లీ ఎస్టాబ్లిష్మెంట్-బేస్డ్ ఎంప్లాయ్మెంట్ సర్వే(ఏక్యూఈఈఎస్)’ పేరిట విడుదల చేశారు.
మొత్తం ఉద్యోగాల్లో 41 శాతం ఒక్క ఉత్పత్తి రంగంలోనే ఉండడం విశేషం. తర్వాత విద్యా రంగంలో 22 శాతం, వైద్య రంగంలో 8 శాతం, వాణిజ్యం 7శాతం, ఐటీ/బీపీఓ 7శాతం చొప్పున ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. గణాంకాల ఆధారంగా విధానాల రూపకల్పనే లక్ష్యంగా ఈ సర్వే చేపట్టినట్లు భూపేందర్ యాదవ్ తెలిపారు. కరోనా సమయంలో దాదాపు 27 శాతం సంస్థల్లో ఉద్యోగాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అయితే, దాదాపు 81 శాతం మంది ఉద్యోగులు మహమ్మారి సంక్షోభంలోనూ పూర్తిస్థాయి వేతనాలు అందుకున్నారని వెల్లడించారు.
ఐటీ/బీపీఓ రంగంలో ఉద్యోగాల కల్పన 152 శాతం వృద్ధి చెందిందని నివేదిక తెలిపింది. తర్వాత వైద్య రంగంలో 77 శాతం, విద్యలో 39 శాతం, ఉత్పత్తి రంగంలో 22 శాతం, రవాణా రంగంలో 68 శాతం, నిర్మాణ రంగంలో 42 శాతం వృద్ధి కనబడిందని పేర్కొంది. వాణిజ్య రంగంలో మాత్రం ఉపాధి కల్పన 25 శాతం, ఆతిథ్య-రెస్టారెంట్ రంగంలో 13 శాతం తగ్గినట్లు తెలిపింది. 90 శాతం సంస్థలు 100 మంది కంటే తక్కువ ఉద్యోగులతో పనిచేస్తున్నాయని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక