విమానాశ్రయంలో ఇంధన ఆదా

విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ఇంధన ఆదా కోసం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. విద్యుత్‌ టాక్సీ వ్యవస్థ కోసం...

Published : 04 Mar 2021 00:58 IST

ముంబయి: విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ఇంధన ఆదా కోసం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. విద్యుత్‌ టాక్సీ వ్యవస్థ కోసం 400 ఉత్పత్తి స్లాట్లను రిజర్వ్‌ చేసుకోవడానికి వీల్‌థగ్‌ పీఎల్‌సీ అనే సంస్థతో చేతులు కలిపింది. ఈ వ్యవస్థలో విమానాశ్రయ పరిధిలో రన్‌వే వరకు విమానం తన ఇంజిన్‌ల శక్తిని వినియోగించుకోకుండానే నడపొచ్చు. దీని వల్ల ఇంధనం ఆదాయ కావడంతో పాటు కర్బన ఉద్గారాలు, ధ్వని స్థాయి తగ్గుతుంది. ఈ వీల్‌థగ్‌ వ్యవస్థ విమానంలోని ముక్కు దగ్గరి చక్రాల వద్ద అధిక టార్క్‌ మోటార్‌లను ఉంచుతుంది. పైలట్లు వీటిని నియంత్రించి విమానాశ్రయంలో విమానాన్ని కదపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని