Published : 08 Jan 2021 00:57 IST

సమానత్వ సుంకం ఒక్క ‘అమెరికా’కే కాదు..

 అన్ని ప్రవాస ఇ-కామర్స్‌ కంపెనీలకూ
భారత్‌ స్పష్టీకరణ

దిల్లీ: 2 శాతం సమానత్వ సుంకం (ఈక్వలైజేషన్‌) అనేది అమెరికా కంపెనీలపై మాత్రమే కాదని.. భారత్‌లో ఉండే అన్ని ప్రవాస ఇ-కామర్స్‌ ఆపరేటర్లకు సమానంగా వర్తిస్తుందని భారత్‌ గురువారం స్పష్టం చేసింది. అమెరికా ఇ-కామర్స్‌ కంపెనీలపై విధించిన 2 శాతం డిజిటల్‌ సేవల పన్ను(ఇకామర్స్‌ సరఫరాలపై) అనేది వివక్షతో కూడుకున్నదని.. అంతర్జాతీయ పన్ను సూత్రాలకు విరుద్ధంగా ఉందని అమెరికా ట్రేడ్‌ రెప్రెజెంటేటివ్‌(యూఎస్‌టీఆర్‌) దర్యాప్తు పేర్కొన్న నేపథ్యంలో, భారత్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. అమెరికా నోటీసులను భారత ప్రభుత్వం పరిశీలిస్తోందని, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందుకు తగ్గ చర్యలు తీసుకుంటుందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ విషయంపై యూఎస్‌టీఆర్‌కు భారత్‌ తన అభిప్రాయాలను జులై 15, 2020లోనే దాఖలు చేసింది. నవంబరు 5, 2020 నాటి ద్వైపాక్షిక చర్చల్లోనూ పాల్గొంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని