ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి రూ.10 వేల కోట్ల పెట్టుబడులు!

మే నెలలో రికార్డు స్థాయిలో భారత ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి దాదాపు రూ.10 వేల కోట్లు నికర పెట్టుబడుడులు వచ్చి చేరాయి. మార్చి 2020 తర్వాత ఇదే అత్యధికం కావడం విశేషం. మార్చిలో వచ్చిన....

Published : 09 Jun 2021 22:12 IST

దిల్లీ: మే నెలలో రికార్డు స్థాయిలో భారత ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి దాదాపు రూ.10 వేల కోట్లు నికర పెట్టుబడులు వచ్చి చేరాయి. మార్చి 2020 తర్వాత ఇదే అత్యధికం. మార్చిలో వచ్చిన రూ.9,115 కోట్లు, ఏప్రిల్‌లో వచ్చిన రూ.3,437 కోట్లతో పోలిస్తే పెట్టుబడులు ఈసారి భారీ స్థాయిలో పుంజుకున్నాయి. అంతకుముందు జులై 2020 నుంచి మొదలుకొని ఫిబ్రవరి 2021 వరకు మ్యూచువల్‌ ఫండ్ల నుంచి పెట్టుబడులు వెనక్కి మళ్లిన విషయం తెలిసిందే.

మరోవైపు డెట్‌ మ్యూచువల్‌ ఫండ్ల నుంచి మే నెలలో దాదాపు రూ.44,512 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. మొత్తంగా మే నెలలో మ్యూచువల్‌ ఫండ్లలోని అన్ని సెగ్మెంట్ల నుంచి రూ.38,602 కోట్లు వెనక్కి వెళ్లాయి. అదే ఏప్రిల్‌లో రూ.92,906 కోట్లు వచ్చి చేరాయి. ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌ మినహా దాదాపు అన్ని ఈక్విటీ స్కీముల్లోకి పెట్టుబడులు భారీగా వచ్చి చేరాయి. దీంతో మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ మార్కెట్‌ విలువ రూ.33 లక్షల కోట్లతో జీవనకాల గరిష్ఠానికి చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని