Evergrande: ఎవర్‌ గ్రాండే షేర్ల ట్రేడింగ్‌ నిలిపివేత

తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఎవర్‌గ్రాండె సంస్థ హాంకాంగ్‌లో షేర్ల ట్రేడింగ్‌పై సస్పెన్షన్‌ విధించింది. దీంతో కంపెనీ పునర్‌ వ్యవస్థీకరణ ప్రణాళిక వార్త వినేందుకు

Published : 03 Jan 2022 20:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఎవర్‌గ్రాండె సంస్థ షేర్ల ట్రేడింగ్‌పై హాంకాంగ్‌లో సస్పెన్షన్‌ విధించింది. దీంతో కంపెనీ పునర్‌ వ్యవస్థీకరణ ప్రణాళిక వార్త వినేందుకు కంపెనీ ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. షేర్ల సస్పెన్షన్‌పై ఎవర్‌ గ్రాండే ఎటువంటి వివరణను స్టాక్‌ ఎక్స్‌ఛేంజికి ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ కంపెనీపై 300 బిలియిన్‌ డాలర్ల అప్పుల్లో ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీ షేర్లు, ఆస్తుల విక్రయాలు ద్వారా సప్లయర్లు, రుణదాతలకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. 

తన ఆస్తుల నిర్వహణ కంపెనీలో పెట్టుబడి దారులకు చెల్లింపులపై ఎవర్‌గ్రాండే గత వారం కీలక నిర్ణయం తీసుకొంది. ప్రతి ఇన్వెస్టర్‌కు నెలకు 1,257 డాలర్ల చొప్పున మూడు నెలలపాటు అందిస్తామని వెల్లడించింది. దీనిని వారు పెట్టిన అసలు మొత్తం కింద భావించాలని పేర్కొంది. ఇన్వెస్ట్‌మెంట్‌ మెచ్యూరిటీతో సంబంధం లేకుండా దీనిని అందిస్తామని వెల్లడించింది. వీటికి సంబంధించిన పూర్తివివరాలను వెల్లడించలేదు.

గత నెల ఎవర్‌ గ్రాండే విదేశీ బాండ్లకు సంబంధించిన వడ్డీలను చెల్లించలేదు. అదే సమయంలో ఎవర్‌గ్రాండేకు చెందిన 39 భవనాలను 10 రోజుల్లో కూలగొట్టాలని హనాన్‌ ప్రావిన్స్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలు డిసెంబర్‌ 30న వెలువడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని