Evergrande Crisis: ఈవారం దేశీయ బాండ్ వడ్డీలు చెల్లిస్తామన్న ఎవర్‌గ్రాండ్!
దివాలా అంచున్న ఉన్న చైనా స్థిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండ్ మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఈవారంలో చెల్లించాల్సిన వడ్డీ బకాయిల్లో కొన్నింటిని చెల్లిస్తామని తెలిపింది...
బీజింగ్ : దివాలా అంచున్న ఉన్న చైనా స్థిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండ్ మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఈవారంలో చెల్లించాల్సిన వడ్డీ బకాయిల్లో కొన్నింటిని చెల్లిస్తామని తెలిపింది. మరోవైపు ఈ సంక్షోభం నుంచి సంస్థను కాపాడే విషయమై చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఇప్పటిప వరకు ఎలాంటి స్పష్టతనివ్వలేదు.
5.8 శాతం వడ్డీరేటుతో ఉన్న దేశీయ బాండ్ల వడ్డీని సెప్టెంబరు 23న చెల్లిస్తామని ఎవర్‌గ్రాండ్ ప్రకటించింది. ఈ బాండ్ల కాలపరిమితి సెప్టెంబరు 2025 వరకు ఉంది. అయితే, వచ్చే ఏడాది మార్చితో ముగియనున్న అమెరికా బాండ్ గురించిన చెల్లింపులపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఈ బాండ్‌పై 83.5 బిలయన్ డాలర్ల వడ్డీ చెల్లించాల్సి ఉంది. అలాగే 2024 మార్చి కాలపరిమితితో ఉన్న బాండ్‌పై సెప్టెంబరు 29 నాటికి 47.5 మిలియన్ డాలర్లు చెల్లించాలి. వీటి గురించి ప్రస్తుతం ఎవర్‌గ్రాండ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే విదేశీ ఎక్స్ఛేంజీల్లో ఎవర్‌గ్రాండ్ బాండ్ల ట్రేడింగ్ నిలిచిపోయింది.
ఎవర్‌గ్రాండ్‌కు మొత్తం 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.22.50 లక్షల కోట్ల) అప్పులు ఉన్నాయి. వీటిని తగ్గించుకోవడానికి సంస్థ గత కొన్ని నెలలుగా ప్రణాళికలు రచిస్తోంది. కానీ, అందుకు ఇప్పటి వరకు ఎలాంటి స్థిర ప్రణాళిక ప్రకటించలేదు. ఇక ఎవర్‌గ్రాండ్ తాజా ప్రకటనతో ఐరోపా మార్కెట్లు కాస్త సానుకూలంగా స్పందించాయి. దాదాపు అన్ని ప్రధాన సూచీలు లాభాల్లోకి ఎగబాకాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ