ఈ ఏడాది ద్రవ్యలోటు 7.5%

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ద్రవ్యలోటు జీడీపీలో 7.5 శాతంగా నమోదు కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా సంక్షోభం వల్ల ఆదాయ వసూళ్లు మందగించడం ఇందుకు నేపథ్యమని అంటున్నారు.

Published : 10 Jan 2021 00:51 IST

నిపుణుల అంచనా

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ద్రవ్యలోటు జీడీపీలో 7.5 శాతంగా నమోదు కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా సంక్షోభం వల్ల ఆదాయ వసూళ్లు మందగించడం ఇందుకు నేపథ్యమని అంటున్నారు. 2020-21కి బడ్జెట్‌ అంచనా అయిన 3.5 శాతంతో పోలిస్తే ఇది రెట్టింపు కావడం గమనార్హం. జీడీపీలో 3.5 శాతం లేదా రూ.7.96 లక్షల కోట్లకు ద్రవ్యలోటు చేరొచ్చని గత కేంద్ర బడ్జెట్‌లో అంచనా వేశారు. అయితే కరోనాతో పోరాటం చేయడానికి నిధులు కావాల్సి రావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 50 శాతం కంటే అధికంగా రూ.12 లక్షల కోట్లను మార్కెట్‌ నుంచి రుణాల రూపంలో సమీకరించింది ప్రభుత్వం. మార్చితో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 7.5 శాతానికి లేదా రూ.14.5 లక్షల కోట్లకు చేరొచ్చని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్‌ అంచనా కట్టారు. రుణాల నుంచి వచ్చే రూ.12 లక్షల కోట్లతో పాటు చిన్న పొదుపు మొత్తాలు, ట్రెజరీ బిల్లుల ద్వారా మిగతా మొత్తాన్ని ప్రభుత్వం పూడ్చుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని