సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు రూ.5.01 లక్షల కోట్లు

సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) కింద నమోదైన కంపెనీల సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.01 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2019-20 ఎగుమతులు రూ.4.66 లక్షల

Updated : 19 Apr 2021 08:57 IST

దిల్లీ: సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) కింద నమోదైన కంపెనీల సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.01 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2019-20 ఎగుమతులు రూ.4.66 లక్షల కోట్లతో పోలిస్తే ఈసారి 7% వృద్ధి కనిపించింది. కొవిడ్‌-19 ప్రభావం ఉన్నా, కంపెనీలు వేగంగా డిజిటలీకరణ వైపు అడుగులు వేయడంతో  ఐటీ రంగానికి గిరాకీ ఏర్పడింది. ఐటీ నిపుణులు ఎక్కడినుంచైనా పనిచేసే వీలు కలగడంతో, ఐటీ పరిశ్రమ ఉత్పాదకతకు ఎటువంటి అవరోధాలు కలుగలేదు. ఎస్‌టీపీఐ దగ్గరున్న ప్రాథమిక సమాచారం ప్రకారం, 2020-21లో ఎస్‌టీపీఐ నమోదిత సంస్థల ఎగుమతులు 7%పెరిగి, రూ.5.0 లక్షల కోట్లకు చేరాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు