September Exports: సెప్టెంబరు ఎగుమతుల్లో 21% వృద్ధి

ఆగస్టులో దేశ ఎగుమతులు 21.35 శాతం పెరిగి 33.44 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2.45 లక్షల కోట్ల)కు చేరాయి....

Published : 02 Oct 2021 13:07 IST

దిల్లీ: ఆగస్టులో దేశ ఎగుమతులు 21.35 శాతం పెరిగి 33.44 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2.47 లక్షల కోట్ల)కు చేరాయి. దిగుమతులు సైతం 84.75 శాతం పెరిగి 56.38 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.4.18 లక్షల కోట్ల)కు పెరిగాయి. ఫలితంగా వాణిజ్య లోటు 22.94 బిలియన్‌ డాలర్లకు చేరింది. బంగారం దిగుమతులు ఏకంగా 750 శాతం పెరిగి 5.11 బిలియన్‌ డాలర్లకు చేరడమే వాణిజ్య లోటు పెరుగుదలకు ప్రధాన కారణం. వాణిజ్య శాఖ తాత్కాలిక గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- సెప్టెంబరులో వాణిజ్య లోటు 78.81 బిలియన్‌ డాలర్లకు చేరింది.

* చమురు దిగుమతులు 200% వృద్ధితో 17.436 బి.డాలర్లకు, పసిడి 750 శాతం పెరిగి 5.11 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

* ఇంజినీరింగ్‌, పెట్రోలియమేతర ఉత్పత్తులు, రత్నాభరణాల ఎగుమతులు వరుసగా 36.7 శాతం పెరిగి 9.42 బి.డాలర్లకు, 18.72 శాతం పెరిగి 28.53 బి.డాలర్లకు, 19.71 శాతం పెరిగి 3.23 బి.డాలర్లకు చేరాయి. రసాయనాల ఎగుమతులు మాత్రం 8.47 శాతం తగ్గాయి.

* ఇక ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగం(ఏప్రిల్‌-సెప్టెంబరు)లో ఎగుమతులు 56.92 శాతం పెరిగి 197.11 బిలియన్ డాలర్లకు చేరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని