ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ vs బ్యాంక్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్లు

మ్యూచువ‌ల్ ఫండ్ ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్‌లో మూడేళ్ల త‌ర్వాత ఆదాయ ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.​​​​​....

Updated : 01 Jan 2021 19:32 IST

ప‌దేళ్ల‌ బాండ్ రేట్లు పెరిగే కొద్దీ ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్‌లు(ఎఫ్ఎమ్‌పీ) మదుపరులని మరింత ఆకర్షిస్తున్నాయి. పెరుగుతున్న వ‌డ్డీ రేట్ల నేప‌థ్యంలో ప‌దేళ్ల బాండ్ల‌పై వ‌డ్డీ రేట్లు 8 శాతానికి చేరుకున్నాయి. కొత్త ఫండ్‌ను రిలీజ్ చేసిప్పుడు మాత్ర‌మే పెట్టుబ‌డులు చేసే అవ‌కాశ‌ముంటుంది. అదేవిదంగా మెచ్యూరిటీ కంటే ముందు విత్‌డ్రా చేసేందుకు వీలుండ‌దు. అయితే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో విక్ర‌యించేందుకు వీలుంటుంది. ఎఫ్ఎమ్‌పీలు కాల పరిమితి తో కూడిన క్లోజెడ్ ఎండెడ్‌ డెట్ ఫండ్లు అని చెప్పవచ్చు. కంపెనీలు వీటి ద్వారా రాబడి తో పాటు పెట్టుబడి పై నష్టం లేకుండా చేస్తాయి, కాబట్టి ఇవే మదుపు చేసేవి కూడా డెట్ పథకాల్లోనే. ఈ ప‌థ‌కాల కాల పరిమితి కి అనుగుణంగానే ఎఫ్ఎమ్‌పీల‌ కాల పరిమితి కూడా ఉంటుంది. దీని వాళ్ళ వడ్డీ రేటు రిస్క్ తగ్గుతుంది. అయితే పెట్టుబడి పై నష్టం తక్కువ ఉన్నా ఇతర ఫండ్ల లాగే రాబడి గురించి క‌చ్చితంగా చెప్పలేము, అంచనా మాత్రమే వేయగలము. వ‌డ్డీ రేట్ల నేప‌థ్యంలో ప‌దేళ్ల బాండ్ల‌పై వ‌డ్డీ రేట్లు 8 శాతానికి చేరుకున్నాయి. కొ ఫండ్‌ను రిలీజ్ చేసిప్పుడు మాత్ర‌మే పెట్టుబ‌డులు చేసే అవ‌కాశ‌ముంటుంది. అదేవిదంగా మెచ్యూరిటీ కంటే ముందు విత్‌డ్రా చేసేందుకు వీలుండ‌దు. అయితే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో విక్ర‌యించేందుకు వీలుంటుంది.

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఎఫ్ఎమ్‌పీ ల‌పై ప‌న్ను ఇత‌ర వివ‌రాలు…

  1. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌చ్చే ఆదాయం, డిపాజిట్‌దారుడి ఆదాయానికి క‌లిపి మొత్తం ఏ శ్లాబులోకి వ‌స్తుందో అంత ప‌న్ను వ‌ర్తింప‌జేస్తారు.
  1. ఎఫ్ఎంపీలు సాధారణంగా సర్టిఫికెట్ అఫ్ డిపాజిట్లు, కమర్షియల్ పేపర్లు, మనీ మార్కెట్ పధకాలు, AAA కార్పొరేట్ బాండ్లు లాంటి పథకాల్లో మదుపు చేస్తాయి. ఈ పథ‌కాల కాల వ్యవధి ముగిసే వరకు ఎఫ్ఎంపీ లు వాటిలో మదుపు చేసి ఉంటాయి. దీని కారణంగా కాల పరిమితి ముగిసే ముందు పెట్టుబడి ని వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. బ్యాంకు ఎఫ్‌డీల‌లో ఇండెక్సేష‌న్ ప్ర‌యోజ‌నాలు ఉండ‌వు.

  2. ఒకవేళ డబ్బు అవసరం ఉంటుందని అనుమానం ఉంటే ఎఫ్ఎంపీలు సరైనవి కావు. దీని బదులు మదుపర్లు ఫిక్సిడ్ డిపాజిట్లను పరిశీలించవచ్చు, ఎందుకంటే వాటిలో కాస్త చార్జీలు విధించి అయినా డబ్బు వెనక్కి తీసుకునే సౌకర్యం ఉంటుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే ఎఫ్ఎంపీ లు స్టాక్ ఎక్స్చేంజి లో కొని, అమ్మే అవకాశం ఉంది.

  3. ఫిక్సిడ్ డిపాజిట్ల తో పోలిస్తే ఎఫ్ఎంపీ లు పన్ను పరంగా మేలు(ముఖ్యంగా 30 శాతం పన్ను స్లాబ్ లో ఉన్న వారికి). అయితే కనీసం 3 ఏళ్ళు మదుపు చేస్తేనే ఇండెక్సేష‌న్ వల్ల పన్ను తగ్గే అవకాశం ఉంది. చాలా వరకు ఎఫ్ఎంపీ లు కనీసం 3 ఏళ్ళ కాల పరిమితి తో కుడి ఉంటాయి. 3 ఏళ్ళ వరకు డబ్బు అవసరం లేకపోతే నిశ్ఛయింతగా వీటిలో మదుపు చేయవచ్చు.

  4. వడ్డీ రేట్లు పెరగబోతున్న తరుణంలో ఇలాంటి పధకాలు ఎంతో లాభదాయకమని నిపుణులు చెబుతున్నారు. పదవీ విరమణ కలిగిన వారికి లేదా తక్కువ రిస్క్ తో రాబడి పొందాలనుకునే వారికి ఇలాంటి పధకాల ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే వీటి లాక్ ఇన్ గురించి మాత్రం గుర్తు పెట్టుకోండి.

  5. మూడేళ్ల కంటే ఎక్కువ కాలం వీటిని కొన‌సాగిస్తే దీర్ఘ‌కాలిక మూలధ‌న ప‌న్నుగా ప‌రిగ‌ణిస్తారు. ఇండెక్సేన్‌తో క‌లిపి 20 శాతం ప‌న్ను ప‌డుతుంది.

  6. మూడేళ్ల కంటే ఎక్కువ కాలం వీటిని కొన‌సాగిస్తే దీర్ఘ‌కాలిక మూలధ‌న ప‌న్నుగా ప‌రిగ‌ణిస్తారు. ఇండెక్సేన్‌తో క‌లిపి 20 శాతం ప‌న్ను ప‌డుతుంది.

  7. ఇండెక్సేష‌న్ అంటే ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మిన‌హాయించిన త‌ర్వాత వ‌చ్చే రాబ‌డిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. అంటే మూడేళ్ల కంటే ఎక్కువ కాలం ఎఫ్ఎమ్‌పీల‌లో పెట్టుబ‌డులు చేసిన‌వారికి ద్ర‌వ్యోల్బ‌ణం మిన‌హాయించ‌గా వ‌చ్చిన రాబ‌డిపై ప‌న్ను ప‌డుతుంది.

  8. సెబీ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎఫ్ఎంపీల‌ను మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు స్టాక్ ఎక్చ్‌ఛేంజీల‌లో న‌మోదు చేయాలి. మెచ్యూరిటీ ముగిసేవర‌కు కొన‌సాగించాల‌నుకుంటేనే వీటిని ఎంచుకోవాలి.

  9. ఎఫ్ఎమ్‌పీల‌లో క్రెడిట్ రిస్క్ కూడా ఉంటుంది. పెట్టుబ‌డుదారులు ఇందులో పెట్టుబ‌డులు పెట్టేముందు, సెక్యూరిటీల‌ రేటింగ్ తెలుసుకునేందుకు ఆఫ‌ర్ డాక్యుమెంట్‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించాలి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని