Credit card: ఫెడ‌ర‌ల్ బ్యాంక్‌ నుంచి మొబైల్ బేస్డ్‌ క్రెడిట్ కార్డ్‌

కేవ‌లం కార్డు జారిచేసిన‌ మూడు నిమిషాల‌లోపే వెర్చువ‌ల్ ఫార్మెట్‌లో కార్డును ఉప‌యోగించుకోవ‌చ్చు

Updated : 23 Sep 2021 20:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా క్రెడిట్ కార్డులకు డిమాండ్ స్థిరంగా పెరుగుతోంది. చాలా మంది ఈ కార్డుల‌ను వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. అందువ‌ల్ల చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డుల‌ను ఇష్యూ చేయ‌డంతో పాటు అనేక ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఫెడ‌ర‌ల్ బ్యాంక్ కూడా ఓ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఇది మొబైల్ ఆధారిత క్రెడిట్ కార్డ్‌. ఫిన్‌టెక్ సంస్థ‌ వన్‌కార్డ్‌ భాగస్వామ్యంతో ఈ కార్డును ప్రారంభిస్తున్న‌ట్లు సంస్థ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. రాబోయే పండగ సీజ‌న్‌లో వినియోగ‌దారుల‌కు మరింత ద‌గ్గ‌ర అయ్యేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు బ్యాంక్‌ వెల్ల‌డించింది.

ఈ క్రెడిట్ కార్డుల‌ను వన్‌కార్డ్ యాప్ ద్వారా జారీ చేయ‌నున్నారు. కేవ‌లం కార్డు జారీ చేసిన‌ మూడు నిమిషాల్లోపే వర్చువ‌ల్ ఫార్మాట్‌లో కార్డును ఉప‌యోగించుకోవ‌చ్చు. ఫిజిక‌ల్ కార్డు కోసం వేచి చూడ‌ల్సిన అవ‌స‌రం లేదు. ఫిజిక‌ల్ కార్డు త‌ర్వాత ఇంటికొస్తుంది. యాప్ ద్వారా వినియోగదారులు తమ క్రెడిట్ కార్డులను నియంత్రించవచ్చు. ఖ‌ర్చుల‌ను ట్రాక్ చేయ‌డం ద‌గ్గ‌ర నుంచి రివార్డు పాయింట్లు, కార్డు లావాదేవీల ప‌రిమితిని సెట్ చేయ‌టం వ‌ర‌కు అన్నీ యాప్ ద్వారా చేయొచ్చు. 23 నుంచి 35 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న యంగ్‌ వ‌ర్కింగ్ ప్రొఫెషన‌ల్స్ ల‌క్ష్యంగా ఈ కార్డుల‌ను ఆఫ‌ర్ చేస్తున్న‌ట్లు బ్యాంక్ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని