Hyundai Festive offers: హ్యుందాయ్‌ కార్లపై రూ.50 వేల రాయితీలు!

హ్యుందాయ్‌ ఇండియా పలు మోడళ్లపై వినియోగదారులకు ప్రయోజనాలు ప్రకటించింది. మోడల్‌ను బట్టి దాదాపు రూ.50,000 వరకు రాయితీలు ఉన్నాయి....

Published : 13 Sep 2021 13:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పండగ సీజన్‌ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు వాహన తయారీ సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా హ్యుందాయ్‌ ఇండియా పలు మోడళ్లపై వినియోగదారులకు ప్రయోజనాలు ప్రకటించింది. మోడల్‌ను బట్టి దాదాపు రూ.50,000 వరకు రాయితీలు ఉన్నాయి. తాజా ఆఫర్లు శాంత్రో, గ్రాండ్‌ ఐ10 నియోస్‌, ఆరాపై వర్తిస్తాయి. హ్యుందాయ్‌ వెబ్‌సైట్లో ఆఫర్ల జాబితాను ఉంచారు.  సెప్టెంబరు 30 వరకు మాత్రమే ఇవి వర్తిస్తాయి.


గ్రాండ్‌ ఐ10 నియోస్‌పై అత్యధికంగా రూ.50 వేల మేరకు ఆఫర్లను ఇచ్చింది. దీంట్లో రూ.35 వేలు నగదు డిస్కౌంట్‌‌, రూ.10వేలు ఎక్స్‌ఛేంజి బెనిఫిట్‌, రూ.5వేలు కార్పొరేట్‌ డిస్కౌంట్‌ ఉన్నాయి. అయితే, ఈ ఆఫర్‌ కేవలం గ్రాండ్‌ ఐ10 నియోస్‌ టర్బో వేరియంట్‌కు మాత్రమే పరిమితం. ఇతర వేరియంట్లపై గరిష్ఠంగా రూ.35,000 వరకు మాత్రమే లబ్ధి చేకూరనుంది.


   

శాంత్రో హ్యాచ్‌బ్యాక్‌కు మొత్తం మీద రూ.40 వేల వరకు లబ్ధి దొరకనుంది. వీటిలో రూ.25 వేలు నగదు‌, రూ.10 వేలు ఎక్స్‌ఛేంజ్‌‌‌, రూ.5 వేలు  కార్పొరేట్‌ డిస్కౌంట్ల కింద అందజేస్తోంది. దీంట్లోనే ‘ఎరా’ వేరియంట్‌పై రూ.25 వేల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. నగదు రాయితీ కింద రూ.10 వేలు, ఎక్స్‌ఛేంజ్‌ రూ.10,000, కార్పొరేట్‌ బోనస్‌ కింద రూ.5,000 వరకు రాయితీ లభించనుంది.


ఇక ఆరా మోడల్‌పై అత్యధికంగా రూ.50 వేల లబ్ధి చేకూరనుంది. నగదు రాయితీ రూ.35 వేలు, ఎక్స్‌ఛేంజ్‌ బెనిఫిట్‌‌ రూ.10 వేలు, కార్పొరేట్‌ బోనస్‌ కింద రూ.5,000 రాయితీ అందనుంది. దీనిలోని సీఎన్‌జీ వేరియంట్‌కి నగదు రాయితీ వర్తించదు.

** హ్యుందాయ్‌కి చెందిన వెన్యూ, క్రెటా, అల్కజార్‌, ఆల్‌ న్యూ ఐ20, ఐ20 ఎన్‌ లైన్‌, టక్సన్‌, కోనా ఎలక్ట్రిక్‌, ఎలెంట్రా, వెర్నాపై మాత్రం ఎలాంటి ప్రయోజనాలు లేవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని