ఆన్‌లైన్‌లో 50కోట్ల మంది ఫేస్‌బుక్‌ యూజర్ల సమాచారం

దాదాపు 50 కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారుల సమాచారం ఆన్‌లైన్‌లో కనిపించడం కలకలంరేపింది. హ్యాకర్లు సులువగా ఈ సమాచారం పొందేలా ఓ వెబ్‌సైట్‌ ఈ వివరాల్ని ఉంచినట్లు బిజినెస్‌ ఇన్‌సైడర్‌.......

Updated : 04 Apr 2021 13:35 IST

మరోసారి బయటపడ్డ సామాజిక మాధ్యమాల భద్రతా వైఫల్యాలు

​​​​

ఇంటర్నెట్‌ డెస్క్‌: దాదాపు 50 కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారుల సమాచారం ఆన్‌లైన్‌లో కనిపించడం కలకలంరేపింది. హ్యాకర్లు సులువుగా ఈ సమాచారం పొందేలా ఓ వెబ్‌సైట్‌లో ఈ వివరాల్ని ఉంచినట్లు బిజినెస్‌ ఇన్‌సైడర్‌ వార్తా సంస్థ పేర్కొంది. ఇందులో 106 దేశాలకు చెందిన వినియోగదారుల ఫేస్‌బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, ప్రాంతాలు, పుట్టిన తేదీలు, ఈ-మెయిల్‌ ఐడీలు, చిరునామాలు ఉన్నట్లు తెలిపింది.

ఈ సమాచారం అంతా పాతదేనని సైబర్‌ నిపుణులు తెలిపారు. అయినప్పటికీ.. సామాజిక మాధ్యమాల్లో వినియోగదారుల సమాచార భద్రతపై సందేహాలకు ఈ ఉదంతం నిదర్శనంగా నిలుస్తోంది. అమెరికాకు చెందిన 267 మిలియన్ల వినియోగదారుల సమాచారం ఆన్‌లైన్‌లో ఉన్నట్లుగా 2019, డిసెంబరులో ఉక్రెయినియన్‌ సెక్యూరిటీ రీసెర్చర్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా లభ్యమైన సమాచారానికీ.. దీనికీ సంబంధం ఉందా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

గతంలో 87 మిలియన్ల ఫేస్‌బుక్‌ ఖాతాదారుల సమాచారం అక్రమంగా కేంబ్రిడ్జి అనలైటికా చేతికి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ఫేస్‌బుక్‌ 2018లో ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో ఫోన్‌నెంబర్‌ ఆధారంగా వినియోగదారుల సమాచారం కనిపించకుండా చేసింది.


Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు