GST: మొదలైన జీఎస్‌టీ మండలి సమావేశం

వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) మండలి 44వ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా

Published : 12 Jun 2021 12:07 IST

దిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) మండలి 44వ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతున్న ఈ భేటీలో ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. కరోనా మందులు, పరికరాలపై పన్నులు తగ్గించే విషయమై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

కరోనా టీకాలు, బ్లాక్‌ ఫంగస్‌ మందులు, మెడికల్‌ ఆక్సిజన్‌, ఆక్సీమీటర్లు, శానిటైజరు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లు, ఉష్ణోగ్రతలు కొలిచే పరికరాలపై పన్నులు తగ్గించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. గత నెల 28న జరిగిన మండలి సమావేశంలో ఈ విషయమై సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే ఇందులో ఏకాభిప్రాయం రాకపోవడంతో దీనిపై అధ్యయనం చేయడానికి మంత్రుల బృందాన్ని నియమించారు. ఆ బృందం తమ నివేదికను గత సోమవారం ఆర్థిక శాఖకు సమర్పించింది. దీనిపైనే నేడు చర్చలు జరగనున్నాయి. ప్రస్తుతం మన దేశంలో తయారయ్యే టీకాలపై 5శాతం, ఇతర మందులు, పరికరాలపై 12శాతం జీఎస్‌టీ అమల్లో ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని