Omicron: ఒమిక్రాన్‌ ప్రభావం తక్కువగానే ఉండొచ్చు: ఆర్థికశాఖ

ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు మరింత పుంజుకోవచ్చని కేంద్ర ఆర్థికశాఖ అంచనావేసింది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ

Published : 12 Dec 2021 17:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు మరింత పుంజుకోవచ్చని కేంద్ర ఆర్థికశాఖ అంచనావేసింది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ శనివారం వెల్లడించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఒమిక్రాన్‌ ప్రభావం తీవ్రత తక్కువగానే ఉండొచ్చని చెప్పారు. కొవిడ్‌ భయాలున్నా.. వరుస త్రైమాసికాల్లో ఆర్థిక వృద్ధిరేటు నమోదు చేసిన అతికొద్ది దేశాల్లో భారత్‌ ఉందని వెల్లడించారు. 2021-22 పూర్తి సంవత్సరం పరంగా చూస్తే కొవిడ్‌ ప్రారంభానికి ముందునాటి స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయని అంచనావేస్తున్నట్లు పేర్కొంది. సేవా,తయారీ, వ్యవసాయ రంగాల్లో వృద్ధిరేటు కలిపి రెండో త్రైమాసికంలో జీడీపీని కరోనా ముందు సమయంలోని వృద్ధిని మించేట్లు చేశాయని ఉంచేట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అఫైర్స్‌ నవంబర్‌ సమీక్ష నివేదికలో వెల్లడించింది. 

‘‘వ్యాక్సినేషన్‌లో వేగం పెరగడంతో పెట్టుబడుల్లో కూడా చురుకుదనం వచ్చింది. సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ నిర్ణయాలు తీసుకోవడం కూడా దీనికి కలిసొచ్చింది. రానున్న త్రైమాసికాల్లో భారత్‌ మరింత మెరుగైన వృద్ధిరేటు నమోదు చేస్తుందని అంచనావేసింది. కరోనా ముందు 2019 అక్టోబర్‌, నవంబర్‌లో ఆర్థిక పరిస్థితి కంటే 2021లో అవే నెలల్లో నమోదైన ఆర్థికపరిస్థితి మెరుగ్గా ఉంది’’ అని పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని