ఆదాయానికి త‌గిన ఆర్థిక ప్ర‌ణాళిక అవ‌స‌రం

తరచూ పధ‌కాలను మారుస్తుంటే తక్కువ రాబడితో పాటు ఒక్కోసారి నష్టాలూ రావొచ్చు...........​​​​​​

Published : 21 Dec 2020 13:09 IST

తరచూ పధ‌కాలను మారుస్తుంటే తక్కువ రాబడితో పాటు ఒక్కోసారి నష్టాలూ రావొచ్చు​​​​​​​

13 సెప్టెంబర్ 2019 మధ్యాహ్నం 2:42

ప్ర‌శ్న‌: నా పేరు బి వి సుబ్బారావు 41, భార్య 39, అబ్బాయిలు 12 , 10 ఏళ్ళు . నెల జీతం రూ 80 వేలు. నెల ఖర్చులు రూ 30 వేలు. టర్మ్ పాలసీ రూ . 50 లక్షలు. ప్రమాద బీమా రూ 25 లక్షలు. పీ పీ ఎఫ్ రూ 15 లక్షలు. మ్యూచువల్ ఫండ్స్ రూ 15 లక్షలు, షేర్లు రూ 7 లక్షలు, ఇతర పెట్టుబడులు రూ 4 లక్షలు.

జ‌వాబు: ముందుగా మీ ఆర్ధిక లక్ష్యాలను గుర్తించండి. ఉదా : పిల్లల ఉన్నత చదువులు, వారి వివాహాలు, ఇల్లు కొనుగోలు, పదవీవిరమణ నిధి సమకూర్చుకోవడం వంటివి. లక్ష్యాల ప్రకారం మదుపు చేస్తే దీర్ఘకాలంలో అధిక రాబడి పొందవచ్చు. తరచూ పధ‌కాలను మారుస్తుంటే తక్కువ రాబడితో పాటు ఒక్కొక్కసారి నష్టాలూ రావొచ్చు.

మీ వార్షిక ఆదాయానికి 10-15 రెట్లు ఉండే టర్మ్ జీవిత బీమా పాలసీని తీసుకోండి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. బీమా, పెట్టుబడి కలిపి ఉన్న పధకాల (ఎండోమెంట్, మనీ బ్యాక్, యూలిప్స్ లాంటివి) నుంచి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. వీటిలో బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ, ప్రీమియం ఎక్కువ .

బంగారంపై ఎక్కువ‌ పెట్టుబడి చేయకండి . బంగారం దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని అధిగమిస్తుందే తప్ప, అధిక రాబడి ఇవ్వదు. దీని భద్రత ఒక సమస్య.

పదవీవిరమణ నిధి :
మారుతున్న జీవన విధానానికి, ప్రమాణాలకు సరిపడే పదవీవిరమణ నిధి ఎంతో అవసరం. 

అధిక ఆదాయం ఉన్నవారు ఒక సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ప్లానర్ ను సంప్రదించినట్లైతే , దీర్ఘకాలంలో మరింత లాభపడే అవకాశాలు ఉంటాయి. సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ప్లానర్ కోసం ఈ కింది లింకు ద్వారా తెలుసుకోండి.

https://india.fpsb.org/cfp-certificants-directory/?search_by=&search=&city=&state=&employment=

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని