మ‌దుపు చేసే స‌మ‌యంలో ఇవిచేయ‌కండి

మంచి సంపద సృష్టించుకోవాలంటే ఈ 5 తప్పులని మాత్రం అస్సలు చేయకండి​​​​​​....

Published : 19 Dec 2020 10:46 IST

మంచి సంపద సృష్టించుకోవాలంటే ఈ 5 తప్పులని మాత్రం అస్సలు చేయకండి​​​​​​​

అందరం ఎదో ఒక రూపం లో మదుపు చేస్తాం. ఇందులో ఎన్నో తప్పులు ఉంటాయి, కానీ ఎప్పటికప్పుడు తప్పులని తెలుసుకోవడమే ముఖ్యం. ఈ కింద తెలిపిన కొన్ని తప్పులని చేయకుండా ఉంటే మీరు మంచి సంపద సృష్టించుకోగలరు:

ఉచిత స‌ల‌హాలు తీసుకుని మ‌దుపుచేయ‌డం:

ఎవ‌రైనా ప‌లానా కంపెనీ షేర్లు బావుంటాయి తీసుకోమ‌ని చెబితే కంగారు గా కొనేయ‌కుండా కాస్త ప‌రిశీలించాలి.విశ్లేష‌కులు చెప్పింది విన‌డం అర్థం చేసుకోవ‌డం మంచిదే కానీ సొంతంగా ఆలోచించ‌కుండా నిర్ణ‌యం తీసుకోవ‌ద్దు…

వైవిధ్య‌త లేక‌పోవ‌డం:

పెట్టుబ‌డిలో వైవిధ్యం అవ‌స‌రం. మొత్తం డ‌బ్బు ఒకే కంపెనీలో మ‌దుపుచేయ‌కూడ‌దు. వేర్వేరు కంపెనీల్లో మ‌దుపుచేయ‌డం మంచిది. అన్నీ ఒకే కంపెనీ షేర్లు కొన‌డం వ‌ల్ల ఆకంపెనీ షేరు ధ‌ర త‌గ్గితే మ‌న పెట్టుబ‌డి విలువ త‌గ్గిపోతుంది. అదే మూడుకంపెనీల్లో మ‌దుపు
చేశార‌నుకోండి ఒక కంపెనీ షేరు ధ‌ర త‌గ్గినా మ‌రోకంపెనీ షేరు ధ‌ర పెర‌గొచ్చు. ఆ విధంగా మొత్తం పెట్టుబ‌డి విలువ త‌గ్గిపోదు.

షేర్లు కొనేముందు ఆయా కంపెనీల వ్యాపారంగురించి అవ‌గాహ‌న లేకుండా మ‌దుపుచేయ‌డం
మ‌నం మ‌దుపుచేసే కంపెనీ ఏ వ్యాపారం చేస్తుంది. భ‌విష్యత్తులో ఆ కంపెనీ ఉత్ప‌త్తుల‌కు డిమాండు ఉంటుందా లేక వేరే ఉత్ప‌త్తులు వ‌స్తే ఈకంపెనీ నిల‌బ‌డ‌గ‌ల‌దా త‌దిత‌ర విష‌యాల‌ను ఆలోచించుకోవాలి. ఉదాహార‌ణ‌కు ముడిచ‌మురు శుద్ధిచేసే కంపెనీలో మ‌దుపుచేయాల‌నుకుంటున్నారు. ఈ విధంగా ఆలోచించుకోవాలి - ముడిచ‌మురుకు భ‌విష్య‌త్తులో డిమాండు ఉంటుందా లేదా ప్ర‌త్య‌మ్నాయ ఇంధనం ఏదైనా వ‌స్తుందా?
అమెరికా లో త‌యార‌య్యే షేల్ గ్యాస్ మూలంగా ఈ రంగానికి ఏదైనా ముప్పుందా?

మ‌దుపుచేసే రంగం లో రిస్క్ ఎంతుందో తెలుసుకోకుండా పెట్టుబడిచేయ‌డం:

ఏ రంగానికి చెందిన కంపెనీ లోపెట్టుబ‌డి చేస్తున్నామ‌నేది చాలా కీలకం. ఆ రంగం అభివృద్ధి చెందే అవ‌కాశాలున్నాయా లేదా తెల‌సుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు త‌యారీరంగానికి చెందిన కంపెనీల్లో మ‌దుపుచేయాల‌నుకుంటున్నారు. అప్పుడు ఆ రంగం అభివృద్ధిచెందుతుందా లేదా ఇంకా చెందే అవ‌కాశాలున్నాయా అంచ‌నా వేయాలి. ప్ర‌భుత్వ విధానాలు ఎలా ఉన్నాయి మొద‌లైన ఇత‌ర అంశాల‌ను ప‌రిశీలించుకోవాలి

ఎక్కువ మార్జిన్లు తీసుకుని ట్రేడింగ్ చేయ‌డం:

మార్జిన ట్రేడింగులో ట్రేడ‌ర్ ద‌గ్గ‌రి ఉన్నడ‌బ్బుకి కొన్నింత‌లు అద‌నంగా బ్రోకింగ్ సంస్థ‌లు ట్రేడ‌ర్ల‌కు అందిస్తాయి. ఈ మార్జిన్ మొత్తాన్ని ఆరోజు ట్రేడింగ్ పూర్త‌య్య‌లోప‌ల లేదా బ్రోకింగ్ సంస్థ ఇచ్చిన గ‌డువు లోప‌ల తిరిగి ట్రేడ‌ర్ చెల్లించాలి. ఉదాహార‌ణ‌కు ఒక ట్రేడ‌ర్ ద‌గ్గ‌ర రూ. 10,000 ఉన్నాయ‌నుకుందాం. రూ. 10000 తో మార్జిన్ ట్రేడింగ్ 3 రెట్లు ఇస్తే రూ.30000 అవుతుంది.
ఆ ట్రేడ‌ర్ రూ. 30వేలతో ట్రేడింగ్ చేయ‌వ‌చ్చు… కానీ ఇది న‌ష్ట‌భ‌యంతో తో కూడుకుని ఉంటుంది. ఆరోజు ట్రేడింగులో 30శాతం న‌ష్ట‌పోతే మొత్తం రూ. 9వేలు న‌ష్టం వ‌స్తుంది. అంటే దాదాపు పెట్టుబ‌డి మొత్తం న‌ష్ట‌పోతారు.

ఇంట్రా డే ట్రేడింగు చేయ‌డం:

త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ లాభాలు పొందాల‌ని డే ట్రేడింగు చేసేట‌పుడు న‌ష్టాలు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. వీలైనంత వ‌ర‌కూ ఇంట్రా డే ట్రేడింగు చేయ‌డం త‌గ్గించాలి. రిస్క్ తీసుకునే త‌త్వం ఉన్న‌వారు ఇంట్రా డే ట్రేడింగు చేస్తుంటారు. అయితే వీటికి స‌మ‌యాన్ని బ‌ట్టి వేగంగా ఆర్డ‌ర్ లు ప్లేస్ చేయ‌గ‌ల సాంకేతిక‌త వినియోగించి ట్రేడ‌ర్లు ట్రేడింగు చేస్తుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని