ఆదాయ ప‌న్ను నిబంధ‌న‌ల్లో వ‌చ్చిన 5 మార్పులు

బడ్జెట్ 2020 లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సంవత్సరానికి రూ. 15 లక్షల వరకు సంపాదించేవారికి కొత్త ఆదాయపు పన్ను రేట్లు, శ్లాబులు ప్రకటించారు. ఈ కొత్త పన్ను రేట్లు ఆప్ష‌న‌ల్ అంటే ఆదాయ ప‌న్ను చెల్లించేవారు కొత్త రేట్ల‌కు మార‌వ‌చ్చే లేదా పాత రేట్ల‌నే కొన‌సాగించే అవ‌కాశం ఉంది. దీంతో పాటు కంపెనీలపై డివిడెండ్ డిస్ర్టిబ్యూష‌న్ ..

Published : 23 Dec 2020 16:14 IST

బడ్జెట్ 2020 లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సంవత్సరానికి రూ. 15 లక్షల వరకు సంపాదించేవారికి కొత్త ఆదాయపు పన్ను రేట్లు, శ్లాబులు ప్రకటించారు. ఈ కొత్త పన్ను రేట్లు ఆప్ష‌న‌ల్ అంటే ఆదాయ ప‌న్ను చెల్లించేవారు కొత్త రేట్ల‌కు మార‌వ‌చ్చే లేదా పాత రేట్ల‌నే కొన‌సాగించే అవ‌కాశం ఉంది. దీంతో పాటు కంపెనీలపై డివిడెండ్ డిస్ర్టిబ్యూష‌న్ పన్నును తొలగించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఈ కొత్త ఆదాయపు పన్ను ప్రతిపాదనలు 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి

ఆదాయపన్ను శ్లాబ్‌ల్లో మార్పులు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ - 2020లో ప్రకటన చేసింది. ఈ మేరకు ఆదాయపన్ను శ్లాబ్‌ల సంఖ్యను కూడా పెంచారు. పాత శ్లాబులను కొనసాగిస్తూనే కొత్త శ్లాబులను ప్రవేశపెట్టారు. వీటిలో ఏది ఎంచుకోవాలనేది చెల్లింపుదారుడి అభిమతమని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. కొత్త విధానంలో 80సి, 80డి, ఎల్‌టీసీ, హెచ్‌ఆర్‌ఏ, స్టాండర్డ్‌ డిడక్షన్‌, బీమా ప్రీమియం, పీఎఫ్‌, పింఛన్‌ ఫండ్‌ల మినహాయింపులు ఉండవు. మొత్తంగా కొత్త విధానంలో 100 రకాల పన్ను మినహాయింపుల్లో 70 వరకు తొలగించారు. అలాగే రూ. ఐదు లక్షలలోపు ఆదాయం ఉన్నవాళ్లు రిబేట్‌తో కలుపుకుంటే పన్ను చెల్లించక్కర్లేదు. కొత్త విధానంలో మీ ఆదాయపన్నులో మార్పులు ఇలా ఉండనున్నాయి. ఎంత ఆదాయానికి, ఎంత పన్ను ?

  • 5 ల‌క్ష‌ల ఆదాయం వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు
  • రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.7.5 ల‌క్ష‌ల‌కు - 10 శాతం (ఇంత‌కుముందు 20 శాతం)
  • 7.5 ల‌క్ష‌ల నుంచి రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు -15 శాతం ( గ‌తంలో 20 శాతం)
  • రూ.10 ల‌క్ష‌ల నుంచి రూ.12.5 ల‌క్ష‌ల వ‌ర‌కు -20 శాతం (గ‌తంలో 30 శాతం)
  • రూ.12.5 ల‌క్ష‌ల నుంచి రూ.15 ల‌క్ష‌ల వ‌ర‌కు -25 శాతం ( 30 శాతం)
  • రూ.15 ల‌క్ష‌ల‌కు మించిన ఆదాయ‌నికి -30 శాతం ఎలాంటి మార్పు లేదు
  1. ప్ర‌స్తుతం డివిడెండ్ డిస్ర్టిబ్యూష‌న్ పన్ను (డీడీటీ) ఇప్పుడు కంపెనీలు వాటాదారుల‌కు 15 శాతంతో పాటు స‌ర్‌ఛార్జీలు, సెస్‌తో క‌లిపి చెల్లిస్తున్నాయి. కంపెనీల ఆదాయంపై చెల్లించే ప‌న్నుకు ఇది అద‌నం. అయితే కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం, వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి డీడీటీ తీసుకున్న‌వారు వారికి వ‌ర్తించే రేట్ల ప్ర‌కారం చెల్లించాల్సి ఉంటుంది. ఇంత‌క‌ముందు డివిడెండ్ ఆదాయం రూ.10 ల‌క్ష‌లు దాటితే తీసుకున్న‌వారు చెల్లించేవారు. కానీ ఇప్పుడు డివిడెండ్ ఎంతైనా గ్ర‌హీత‌లే ప‌న్ను చెల్లించాలి. 
  2. సరసమైన గృహనిర్మాణాన్ని ప్రోత్సహించడానికి, కొత్త ఇళ్ళు రూ. 45 లక్షల వరకు లోపు గృహాల‌ కొనుగోలుపై అదనపు పన్ను ప్రయోజనం పొందటానికి ఉన్న‌ తేదీని మార్చి 31,2021 వరకు సీతారామన్ పొడిగించారు. రూ. 45 లక్షల వరకు గృహాలను కొనుగోలు చేయడానికి రుణాలు తీసుకున్న గృహ యజమానులు ఇప్పుడు రూ. 1.5 లక్షల అదనపు పన్ను మినహాయింపును పొందటానికి అర్హులు. ఈ గ‌డువు మార్చి 31, 2020 వరకు ఉండ‌గా ఇప్పుడు మ‌ర ఏడాది పొడ‌గించారు. రుణం తీసుకున్న రుణాలపై సరసమైన గృహాలకు లభించే రూ. 2 లక్షల తగ్గింపుకు అదనంగా ఉంటుంది.

  3. అధిక‌ ఆదాయం క‌లిగి ఉన్న‌వారు ఈపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌, సూప‌ర్ యాన్యేయేష‌న్ ఫండ్ అన్ని క‌లిపి ప‌రిమితికి మించి రూ.7.5 ల‌క్ష‌లు దాటితే య‌జామాని వాటాపై ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది.

  4. మొత్తం ఆదాయం ఏడాదికి రూ. 7.5 లక్షలకు మించి ఉంటే ఆదాయపు పన్నుతో పాటు, వడ్డీ లేదా డివిడెండ్ ద్వారా వార్షిక సముపార్జన కూడా పన్ను పరిధిలోకి వస్తుంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని