Updated : 20 Oct 2021 16:39 IST

వ్య‌క్తిగ‌త రుణ మంజూరుకు బ్యాంకులు ఏం చూస్తాయి?

బ్యాంకుల వ‌ద్ద మూల‌ధ‌నం, డిపాజిట్లు పెరిగే కొద్ది ఆ ధ‌నాన్ని వినియోగ‌దారుల‌కు రుణాల రూపంలో బ్యాంకులు అంద‌చేయ‌డం సాధార‌ణ‌ విష‌య‌మే. వ్య‌క్తిగ‌త రుణం (ప‌ర్స‌న‌ల్ లోన్స్‌) గురించి ప్రైవేట్ బ్యాంకులయితే వినియోగ‌దారుల‌నే ఫోన్‌లో కాంటాక్ట్ చేసి తీసుకోమ‌ని అభ్య‌ర్ధిస్తున్నాయి. అయితే కోవిడ్ ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల అవ‌స‌రాల ప్ర‌భావంతో ఈ వ్య‌క్తిగ‌త రుణాల‌ను తీసుకోవ‌డం ఎక్కువ‌యింది. బ్యాంకులు  పేప‌ర్‌లెస్‌, డిజిట‌ల్ అప్లికేష‌న్‌ను అనుమ‌తిస్తున్నాయి. దీంతో లోన్‌ని ఆన్‌లైన్‌లో కూడా అప్ల‌యి చేసుకోవ‌చ్చు. మెరుగైన క్రెడిట్ స్కోర్ ఆధారంగా వ్య‌క్తిగ‌త రుణాలు కూడా త‌క్ష‌ణ‌మే మంజూరు అవుతున్నాయి. వ్య‌క్తిగ‌త రుణం విద్య‌, వివాహం, గృహ పున‌రుద్ధ‌ర‌ణ‌కు ఇంకా అనేక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల కోసం చిన్న‌, పెద్ద ఖ‌ర్చుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

క్రెడిట్ స్కోర్ః అయితే 750, ఇంత‌క‌న్నా ఎక్కువ‌ క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి త‌క్కువ వ‌డ్డీ రేటుతో వ్య‌క్తిగ‌త రుణాన్ని పొంద‌డం సుల‌భం. మంచి క్రెడిట్ స్కోర్ నిర్వ‌హించాలంటే క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు, ఇత‌ర రుణ చెల్లింపులు స‌కాలంలో చేయాలి. వ్య‌క్తిగ‌త రుణానికి వ‌డ్డీ రేటును నిర్ణ‌యించే ముందు బ్యాంకులు రుణ‌దాత `సిబిల్‌` స్కోర్‌నే కాకుండా, మీ రుణ‌ చెల్లింపు చ‌రిత్ర‌ను కూడా ప‌రిశీలిస్తారు. గ‌త 12 నెల‌ల్లో డిఫాల్ట్ చేయని వ్య‌క్తుల‌కు బ్యాంకులు సాధార‌ణంగా రుణాలు ఇస్తాయి. ఒకవేళ లోన్ డిఫాల్ట‌ర్‌కు కొత్త రుణం మంజూరు చేసిన‌ప్ప‌టికీ, వ‌డ్డీరేటు భారీగా ఉండ‌వ‌చ్చు.

ఆదాయంః మీ ఆదాయం ఎంత ఎక్కువ ఉంటే, అంత సుల‌భంగా మీరు రెగ్యుల‌ర్ లోన్ చెల్లింపులు చేయ‌డానికి వెసులుబాటు ఉంటుంది కాబ‌ట్టి మెరుగైన వ‌డ్డీ రేట్ల వ‌ద్ద రుణం ఆమోదించ‌బ‌డే అవ‌కాశాలు పెరుగుతాయి. దీని కోసం ఆదాయ ప‌న్ను రిట‌ర్నుల వంటి చెల్లుబాటు అయ్యే ఆదాయ రుజువుల‌ను స‌మ‌ర్పించండి. మీ ఆదాయం ఎక్కువ‌యితే ఎక్కువ రుణం పొందే అవ‌కాశాలు ఉంటాయి.

ఉద్యోగంః మీరు ప‌నిచేస్తున్న కంపెనీ పేరు కూడా రుణ బ్యాంకు త‌నిఖీ చేస్తుంది. మీరు ప్ర‌ఖ్యాత సంస్థ‌లో ఉద్యోగం చేస్తున్న‌ట్ల‌యితే బ్యాంకు మీకు స్థిర‌మైన కెరీర్ ఉంద‌ని, స‌కాలంలో రుణాన్ని తిరిగి చెల్లిస్తార‌ని నిర్ధారిస్తారు. కాబ‌ట్టి మీకు వ్య‌క్తిగ‌త రుణాన్ని త‌క్కువ వ‌డ్డీరేటుకే ఇవ్వ‌వ‌చ్చు.

మంచి బ్యాంకింగ్ సంబంధాలుః మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల‌ను, పొదుపు ఖాతాల‌ను తెరిచిన త‌ర్వాత వాటిని నిర్వ‌హించే మంచి చ‌రిత్ర క‌లిగి ఉంటే మీరు మీ బ్యాంక్ యొక్క న‌మ్మ‌క‌మైన క‌స్ట‌మ‌ర్‌గా నిరూపిత‌మ‌వుతుంది. మీ బ్యాంక్‌తో మంచి సంబంధం ఆక‌ర్ష‌ణీయ‌మైన వ‌డ్డీ రేట్ల వ‌ద్ద వ్య‌క్తిగ‌త రుణానికి మీ అర్హ‌త మెరుగుప‌డుతుంది.

వ‌డ్డీ రేటుః ఇత‌ర అన్ని రుణాల క‌న్నా కూడా ఈ ప‌ర్స‌న‌ల్ లోన్స్‌కి వ‌డ్డీ రేటు ఎక్కువ ఉంటుంది. బ్యాంకు - బ్యాంకుకి వ‌డ్డీ రేటులో తేడాలుంటాయి. అందుచేత వివిధ బ్యాంకుల వ‌డ్డీ రేట్లు స‌రిచూసుకోవాలి. దీనివ‌ల‌న అతి త‌క్కువ వ్య‌క్తిగ‌త రుణ వ‌డ్డీ రేటును అందించే బ్యాంకును ఎంచుకోవ‌చ్చు. బ్యాంకు పేప‌ర్‌లెస్‌, డిజిట‌ల్ అప్లికేష‌న్‌ను అనుమ‌తించిన‌ట్ల‌యితే ఆన్‌లైన్‌లో లోన్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రుణం కూడా వేగంగా అందుతుంది. బ్యాంక్ వెబ్‌సైట్‌లోని వ్య‌క్తిగ‌త రుణ కాలిక్యులేట‌ర్‌ను ఉప‌యోగించి మీరు ఎంచుకున్న రుణ మొత్తం, వ‌డ్డీ రేటు, తిరిగి చెల్లించే వ్య‌వ‌ధి ఆధారంగా నెల‌వారీ `ఈఎమ్ఐ`లు లెక్కించండి. దీన్ని బట్టి మీరు ఎంచుకునే రుణ మొత్తం పెంచడమో, తగ్గించడమో నిర్ణయించుకోవచ్చు.  

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని