అన్ని సర్కిళ్లలో సబ్‌ గిగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌పై దృష్టి

దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో సబ్‌- గిగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ దక్కించుకోవడంపై ఎయిర్‌టెల్‌ దృష్టిపెట్టింది. ఇళ్ల లోపల, గ్రామీణ ప్రాంతాల్లో కవరేజీ బాగుండేలా చూసుకోవాలని కంపెనీ భావిస్తోందని, స్పెక్ట్రమ్‌

Published : 05 Feb 2021 00:31 IST

ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్‌ విత్తల్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో సబ్‌- గిగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ దక్కించుకోవడంపై ఎయిర్‌టెల్‌ దృష్టిపెట్టింది. ఇళ్ల లోపల, గ్రామీణ ప్రాంతాల్లో కవరేజీ బాగుండేలా చూసుకోవాలని కంపెనీ భావిస్తోందని, స్పెక్ట్రమ్‌ వేలంలో పలు బ్యాండ్‌ల పునరుద్ధరణ, సామర్థ్యాల విస్తరణకు అవసరమైన కొత్త తరంగాలను కొనుగోలు చేస్తామని ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్‌ విత్తల్‌ అన్నారు. ఎయిర్‌టెల్‌ మూడో త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆయన పెట్టుబడిదార్లను ఉద్దేశించి మాట్లాడారు. సబ్సిడీ ధరలకే స్మార్ట్‌ఫోన్‌లు ఇవ్వడం వల్ల మార్కెట్‌లో విలువ తగ్గిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రత్యర్థి సంస్థల మొబైల్‌ రాయితీలను ఎదుర్కొనేందుకు మార్కెట్‌లో పోటీనిచ్చే విధంగా కంపెనీ నిర్ణయాలు ఉంటాయని అన్నారు. 5జీ సేవల ప్రారంభం వల్ల మూలధన వ్యయాల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అంచనా వేశారు. ‘పలు సర్కిళ్లలో మాకు సబ్‌ గిగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ లేదు. ఈ సారి వేలంలో పొందేందుకు ప్రయత్నిస్తాం. 1800 బ్యాండ్‌లో కొన్ని రెన్యూవళ్లు ఉన్నాయి. 2300 బ్యాండ్‌లో సామర్థ్యానికి అనుగుణంగా స్పెక్ట్రమ్‌ లేదు. వీటిని దృష్టిలో ఉంచుకుని స్పెక్ట్రమ్‌ వేలానికి వెళ్తాం’ అని గోపాల్‌ విత్తల్‌ తెలిపారు. రాగి వైరు స్థానంలో ఫైబర్‌కు మారే ప్రక్రియ వేగవంతం చేసినట్లు వివరించారు. టారిఫ్‌ పెంపు ఎప్పుడు ఉండొచ్చనే అంశంపై స్పందించేందుకు నిరాకరించారు. రూ.3.92 లక్షల కోట్ల విలువైన భారీ స్పెక్ట్రమ్‌ వేలం మార్చి 1న ప్రారంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని