ఈ క‌స్ట‌మ‌ర్ల‌కు బ్యాంకులే అధిక టీడీఎస్ డిడ‌క్ట్ చేయ‌చ్చు

కొత్త నిబంధ‌న‌ల ప్రకారం రిట‌ర్నుల‌ను ఆల‌స్యంగా ఫైల్ చేసిన వారికి కూడా అధిక టీడీఎస్ వ‌ర్తిస్తుంది. 

Updated : 02 Jul 2021 15:02 IST

 
కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్ను విభాగం(సిబిడిటి).. టీడీఎస్‌(మూలం వ‌ద్ద ప‌న్ను) కోసం తీసుకొచ్చిన‌ సెక్ష‌న్ 206AB.. కొత్త‌ నిబంధ‌న‌లు జులై 1 నుంచి అమ‌లులోకి వ‌చ్చాయి. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం కొత్త సెక్ష‌న్ ప్ర‌కారం.. గ‌త రెండు ఆర్థిక సంవత్సరాల ఆదాయానికి సంబంధించి టీడీఎస్‌ రూ.50,000 మించి ఉన్నప్పటికీ.. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వారు అధిక టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. 

అందువ‌ల్ల‌, మీరు కూడా గ‌త రెండేళ్లుగా ఐటి రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌క‌పోతే, ఇప్పుడు వ‌ర్తించే రేటు కంటే రెట్టింపు టీడీఎస్‌ను బ్యాంకులు త‌గ్గించే అవ‌కాశం ఉంది. ఉదాహ‌ర‌ణ‌కి, రామ్ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై గ‌త రెండేళ్లుగా రూ.5 ల‌క్ష‌ల వ‌డ్డీ ఆదాయం పొందుతున్నాడ‌నుకుందాం. ఒక్కో సంవ‌త్స‌రానికి రూ.50వేల టీడీఎస్ వ‌ర్తిస్తుంది. రామ్ ఈ రెండు సంవ‌త్స‌రాలు రిట‌ర్నులు ఫైల్ చేయ‌క‌పోతే ఇప్పుడు రెట్టింపు అంటే 20శాతం టీడీఎస్‌ను డిడ‌క్ట్ చేసే అవ‌కాశం ఉంటుంది. సాధార‌ణంగా వ‌ర్తించే టీడీఎస్ రేటుకు రెట్టింపు.. లేదా 5శాతం .. ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని డిడ‌క్ట్ చేస్తారు. 

కొన్ని సంద‌ర్భాల‌లో.. ఐటీఆర్ ప‌రిధిలోకి రాని వారు కూడా టీడీఎస్‌ను చెల్లించాల్సి రావ‌చ్చు. సాధార‌ణంగా ప‌న్ను ప‌రిధిలోకి రానివారు ఐటీఆర్ దాఖ‌లు చేసేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ అటువంటి వారు రూ.5 ల‌క్ష‌ల మించి వ‌డ్డీ ఆదాయం పొందుతుంటే బ్యాంకులు రూ. 50వేల వ‌రుకు టీడీఎస్‌ను డిడ‌క్ట్ చేస్తాయి. అటువంటి సంద‌ర్భాల‌లో ప‌న్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైల్ చేసినప్ప‌టికీ రిఫండ్ క్లెయిమ్ చేయ‌లేరు. ఎందుకంటే ఇది ప్ర‌భుత్వానికి చెల్లించే ప‌న్ను. 

ప్ర‌స్తుతం గృహిణిగా ఉంటూ, వ్యాపారం లేదా వృత్తి లేని వారు.. మునిప‌టి ఆర్థిక‌ సంవ‌త్స‌రాల‌లో ఉద్యోగం చేసిన సంస్థ నుంచి కొంత మొత్తాన్ని పొంది వుంటే.. చెల్లింపుదారుడు టీడీఎస్‌(రూ. 50వేల కంటే ఎక్కువ ఉంటే)ను డిడ‌క్ట్ చేసినా,  ఆమె ఐటీఆర్ ఫైల్ చేయ‌క‌పోతే.. ప్ర‌స్తుత సంవ‌త్స‌రానికి పొందిన వ‌డ్డీ ఆదాయంపై బ్యాంకులు అధిక టీడీఎస్ డిడ‌క్ట్ చేయ‌వ‌చ్చు. 

ఏవ్య‌క్తికైతే వ‌డ్డీ చెల్లించారో ఆ వ్య‌క్తి ఐటిఆర్ ఫైల్ చేయ‌ర‌ని బ్యాంకులు నిర్ధారించుకోవాలి. అప్పుడే ప‌న్ను చెల్లింపుదారులు వారి ఆదాయంపై రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేసి అధిక టీడీఎస్ నుంచి త‌ప్పించుకోగ‌ల‌గుతారు.  ఒక వ్య‌క్తి ముందు సంవ‌త్స‌రాల‌లో ఐటీఆర్ ఫైల్ చేశారా.. లేదా.. డిడ‌క్ట్ చేసిన టీడీఎస్ మొత్తం.. త‌దిత‌ర వివ‌రాల‌ను ఆదాయ‌పు ప‌న్ను శాఖ కంప్లెయిన్స్ పోర్ట‌ల్ ద్వారా బ్యాంకులు, ఇత‌ర సంస్థ‌లు తెలుసుకోవ‌చ్చు. 

సెక్షన్ 206AB లోని నిబంధనలు ఆదాయపు పన్ను చట్టంలోని అన్ని ఇతర నిబంధనలను భర్తీ చేస్తాయి. మదింపుదారుడు తక్కువ లేదా నిల్ టిడిఎస్ సర్టిఫికేట్ కలిగి ఉన్నా లేదా పన్ను మినహాయింపు కోసం ఫారం 15 జి / 15 హెచ్ లో డిక్లరేషన్ దాఖలు చేసినా ఇది వర్తిస్తుంది. 

అందువల్ల, ఐటీ రిట‌ర్నుల‌ను ఫైల్ చేయాల్సిన భాద్య‌త ఉన్న‌వారు.. త‌ప్ప‌క దాఖ‌లు చేయాలి.  ఒక‌వేళ అస‌లు దాఖ‌లు చేయ‌క‌పోయినా, దాఖ‌లు చేయ‌డంలో ఆల‌స్యం చేసిన అధిక టీడీఎస్‌ను చెల్లించాల్సి వ‌స్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని