స‌రైన ఫండ్ మేనేజ‌ర్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం

ఈక్విటీలకు 50 శాతం కంటే ఎక్కువ కేటాయించాల‌ని నిర్ణ‌యించుకుంటే వారు యాక్టివ్ ఆప్ష‌న్ ఎంచుకోవాల‌ని సూచిస్తున్నారు

Published : 29 Jul 2021 12:06 IST

జాతీయ పింఛ‌ను ప‌థ‌కం (ఎన్‌పీఎస్‌) త‌క్కువ ఖ‌ర్చుతో కూడుకున్న ఎక్కువ ప్రాధాన్య‌త పొందిన ప‌ద‌వీవిర‌మ‌ణ ప‌థ‌కం. ఈ ప‌థ‌కంలో చేరిన‌వారి పెట్టుబ‌డులు డెట్, ఈక్విటీ రెండింటిలో కేటాయింపు జ‌రుగుతుంది. ప‌ద‌వీవిర‌మ‌ణ స‌మ‌యానికి ఒకేసారి పెద్ద‌మొత్తంలో రాబ‌డి చేతికి అందించ‌డంతో పాటు నెల‌వారిగా పెన్ష‌న్‌గా ల‌భిస్తుంది.  అయితే ఎన్‌పీఎస్ ఖాతా విష‌యంలో ఖాతాదారులు కొన్ని త‌ప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా పెన్ష‌న్ స్కీమ్‌లో ఆటో లేదా యాక్టివ్ మోడ్ ఎంపిక‌ చాలా ముఖ్యం అని నిపుణులు చెప్తున్నారు. ఖాతా ప్రారంభం స‌మ‌యంలో ఈక్విటీలకు 50 శాతం కంటే ఎక్కువ కేటాయించాల‌ని నిర్ణ‌యించుకుంటే వారు యాక్టివ్ ఆప్ష‌న్ ఎంచుకోవాల‌ని సూచిస్తున్నారు. దాంతో పాటు ఫండ్ మేనేజ‌ర్‌ను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలో తెలుసుకుందాం.
 యాక్టివ్ లేదా ఆటో మోడ్ ఆప్ష‌న్‌:
 ఎన్‌పీఎస్ ఖాతా తెరిచిన‌ప్పుడు ఈ రెండు ఆప్ష‌న్ల నుంచి ఏదైనా ఒక‌టి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రిస్క్ కొంత ఎక్కువ తీసుకునేవారు, ఈక్విటీల‌కు 50 శాతం కంటే ఎక్కువ కేటాయించాల‌నుకునేవారు యాక్టిక్ ఆప్షన్ ఎంచుకోవాలని ఆర్థిక స‌ల‌హాదారుల సూచ‌న‌.  ఎన్‌పీఎస్ ఖాతా ప్రారంభం స‌మ‌యంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విష‌యం ఇది. 
 ఫండ్ మేనేజ‌ర్ ఎంపిక‌:
 ఫండ్ మేనేజ‌ర్ ఎంపిక విష‌యంలో చాలా జాగ్ర‌త్త వ‌హించాలి. ఈక్విటీల‌కు ఎక్కువ కేటాయించాల‌నుకునేవారు, ఈక్విటీల్లో ఇదివ‌ర‌కు ప‌నితీరు బాగున్న ఫండ్ మేనేజ‌ర్‌ను ఎంచుకోవాలి. డెట్ ఫండ్ల‌కు ఎక్కువ కేటాయించాల‌నుకునేవారు, డెట్ ఫండ్ల‌లో మంచి ట్రాక్ రికార్డు ఉన్నవారిని ప‌రిశీలించాలి.  ఫండ్ మేనేజ‌ర్ అంత‌కుముందు ప‌నితీరు, రాబ‌డి వంటి విష‌యాల‌ను గ్ర‌హించాలి. 

 ఎన్‌పీఎస్ చందాదారులు గుర్తుంచుకోవాల్సిన 5 కీల‌క విష‌యాలు
1. ఈక్విటీ ఎక్కువున్న‌ప్పుడు యాక్టివ్, త‌క్కువ అనుకుంటే ఆటో మోడ్ ఎంచుకోవాలి
2. ఫండ్ మేనేజ‌ర్ డెట్ లేదా ఈక్విటీ విభాగంలో గ‌త చ‌రిత్ర ఆధారంగా మీకు అనుకూలంగా ఉండే ఫండ్ మేనేజ‌ర్‌ను ఎంచుకోవాలి
3. ఫండ్ మేనేజ‌ర్‌ రాబ‌డి నిష్ప‌త్తిని ట్రాక్ చేయాలి
4. ఫండ్ మేనేజ‌ర్ నిర్వ‌హించిన ఫండ్‌లో నిర్థిష్ట కాలానికి ఎంత రాబ‌డి వ‌చ్చిందో తెలుసుకోవాలి
5. మీరు ఎంచుకున్న ఫండ్ మేనేజ‌ర్ ప‌నితీరు ఆశించిన విధంగా లేక‌పోతే మార్చుకోవ‌చ్చు. సంవ‌త్స‌రానికి ఒక‌సారి ఫండ్ మేనేజ‌ర్‌ను మార్చుకునే అవ‌కాశాన్ని ఎన్‌పీఎస్ క‌ల్పిస్తుంది. 

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని