Published : 28 Aug 2021 22:22 IST

Amazon-Future Group: రిలయన్స్‌తో డీల్‌.. సుప్రీం కోర్టుకు ఫ్యూచర్‌ రిటైల్‌

దిల్లీ: రిలయన్స్‌తో కుదిరిన డీల్‌ విషయంలో ఫ్యూచర్‌ రిటైల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ డీల్‌లో ముందుకెళ్లరాదంటూ సుప్రీంకోర్టు ఇటీవలే అమెజాన్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించిన నేపథ్యంలో మరోసారి ఫ్యూచర్‌ గ్రూప్‌ సర్వోన్నత న్యాయస్థానం తలుపుతట్టింది. 600 పేజీలతో కూడిన పిటిషన్‌ను దాఖలు చేసింది. ఒకవేళ రిలయన్స్‌ గ్రూప్‌తో డీల్‌ పూర్తికాకపోతే గ్రూప్‌కు ఊహించని స్థాయిలో నష్టం వాటిల్లుతుందని తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. 35,575 మంది ఉద్యోగుల భద్రత, ₹28వేల కోట్ల మేర రుణాలు చిక్కుల్లో పడతాయని పేర్కొంది. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని త్వరితగతిన విచారణ చేపట్టాలని ఫ్యూచర్‌ గ్రూప్‌ న్యాయవాది సుప్రీంకోర్టును కోరినట్లు ‘రాయిటర్స్‌’ పేర్కొంది. దీనిపై అటు అమెజాన్‌ గానీ, ఫ్యూచర్‌ గ్రూప్‌ గానీ స్పందించలేదు.

ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ గతేడాది ఫ్యూచర్‌ గ్రూప్‌తో ఒప్పందం చేసుకుంది. దీని విలువ రూ.24,713 కోట్లు. ఇదే ఫ్యూచర్‌ గ్రూప్‌కు చెందిన ఫ్యూచర్‌ కూపన్స్‌ లిమిటెడ్‌లో అమెజాన్‌ 2019లో 49 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. ఫ్యూచర్‌ కూపన్స్‌కు 7.3 శాతం మేర ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా ఉంది. దీంతో మూడేళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఫ్యూచర్‌ రిటైల్‌ను కొనుగోలు చేసే హక్కు అమెజాన్‌కు దాఖలు పడింది. అంటే పరోక్షంగా ఫ్యూచర్‌ రిటైల్‌లో అమెజాన్‌కు కూడా యాజమాన్య హక్కులు ఉన్నాయి. అయితే, రిలయన్స్‌-ఫ్యూచర్‌ మధ్య కుదిరిన ఒప్పందం ఈ నిబంధనను ఉల్లంఘిస్తోందని అమెజాన్‌ వాదించింది. సింగపూర్‌ మధ్యవర్తిత్వ కోర్టులో ఈ ఒప్పందాన్ని సవాల్‌ చేసింది. ఈ డీల్‌పై మధ్యవర్తిత్వ కోర్టు స్టే విధించింది. తుది తీర్పు వెలువడే వరకు ఒప్పందంపై ముందుకెళ్లొద్దని ఆదేశించింది. అయితే, విదేశీ మధ్యవర్తిత్వ కోర్టు తీర్పులు భారత్‌లో చెల్లుబాటు కావని ఫ్యూచర్‌ గ్రూప్ వాదిస్తూ వచ్చింది. దీంతో మధ్యర్తిత్వ కోర్టు తీర్పును అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ అమెజాన్‌ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం అమెజాన్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. రిలయన్స్‌తో ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లరాదంటూ ఫ్యూచర్‌ రిటైల్‌కు సింగపూర్‌ మధ్యవర్తిత్వ కోర్టు జారీ చేసిన ఆదేశాలు భారత్‌లో చెల్లుబాటవుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఇప్పుడు ఫ్యూచర్‌ గ్రూప్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని