28న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం... ఎజెండా ఇదే!

చాలా రోజుల విరామం తర్వాత జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం కానుంది. ఈ నెల 28న వర్చువల్‌గా ఈ భేటీ జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగ.....

Published : 15 May 2021 17:28 IST

దిల్లీ: చాలా రోజుల విరామం తర్వాత జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం కానుంది. ఈ నెల 28న వర్చువల్‌గా ఈ భేటీ జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగే 43వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్, అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులు, కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ మేరకు నిర్మలా సీతారామన్‌ ట్వీట్‌ చేశారు. కొవిడ్‌-19 సంబంధిత ఔషధాలు, ఆక్సిజన్‌ పరికరాలు, వ్యాక్సిన్లు వంటి వాటిపై పన్ను రేట్ల అంశం ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. 

ఏటా కనీసం మూడు నెలలకోసారి జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం అవ్వాల్సి ఉంది. కానీ, చివరికి సారిగా గతేడాది అక్టోబర్‌ 5న భేటీ జరిగింది. ఈ క్రమంలో వర్చువల్‌గా కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలని పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌ ఆర్థికమంత్రులు నుంచి డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. అలాగే, కొవిడ్‌ వేళ బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ఉద్దేశించిన ఔషధాలపై పన్నులు తగ్గించాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఇటీవల డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఔషధాలు, వైద్య పరికరాలు, వ్యాక్సిన్లపై పన్ను తగ్గింపు అంశం ప్రధానంగా చర్చకు రానుంది. దీంతో పాటు కరోనా వేళ రాష్ట్రాల ఆదాయం; జీఎస్టీ పరిహారం బకాయిలు; పెట్రోల్‌, డీజిల్‌ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వంటి పలు అంశాలు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని