ఆధార్‌తో జీఎస్‌టీ రిజిస్ర్టేష‌న్‌

కొత్త జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ ప్రామాణీకరణను ఎంచుకునే వ్యక్తికి కేవలం మూడు పనిదినాల వ్యవధిలో లభిస్తుంది

Updated : 01 Jan 2021 20:26 IST

కొత్త వ్యాపారులు ఇప్పుడు ఆధార్ ఉపయోగించి వారి ఆధారాలను త్వ‌ర‌గా ప్రామాణీకరించవచ్చు. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ ) నమోదును సురక్షితంగా చేసుకోవచ్చు. ఆగస్టు 21 నుంచి జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ ప్రామాణీకరణను ఎంచుకోవ‌చ్చ‌ని సీబీఐసీ తెలియజేసింది. ఆధార్ ద్రువీక‌ర‌ణ‌ నిజమైన పన్ను చెల్లింపుదారులకు దోహదపడుతుందని, అదే సమయంలో నకిలీ, మోసపూరిత సంస్థలను జీఎస్‌టీకి దూరంగా ఉంచాలని భావిస్తున్నారు.

ఆధార్ ద్రువీక‌ర‌ణ ద్వారా జీఎస్‌టీ రిజిస్ర్టేష‌న్ ఎలా?

  1. జీఎస్‌టీ రిజిస్ర్టేష‌న్ చేసుకునేట‌ప్పుడు సభ్యుడిని ఆధార్ ద్రువీక‌ర‌ణ‌ ఆప్ష‌న్ ఉంటుంది
  2. దీనికి YES or NO ఎంచుకోవాల్సి ఉంటుంది
  3. ఒక‌వేళ YES క్లిక్ చేస్తే అథెంటికేష‌న్ లింక్ జీఎస్‌టీ న‌మోదిత మొబైల్ నంబ‌ర్ లేదా ఈ-మెయిల్ ఐడీకి వ‌స్తుంది.
  4. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అక్క‌డ ఆధార్ నంబ‌ర్ ఎంట‌ర్ చేసి “validate". పై క్లిక్ చేయాలి
  5. యూఐడీఏఐతో వివరాల‌న్ని స‌రిపోలితే మీకు ఓటీపీ వ‌స్తుంది.
  6. ఓటీపీ ఎంట‌ర్ చేస్తే ఇ-కేవైసీ పూర్త‌యిన‌ట్లు చూపిస్తుంది.
  7. కొత్త జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ ప్రామాణీకరణను ఎంచుకున్న వ్యక్తికి అది కేవలం మూడు పని దినాలలో లభిస్తుంది
  8. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తుదారు ఆధార్ ప్రామాణీకరణ ప్రక్రియ ద్వారా వెళ్ళకూడదనుకుంటే దీనికి NO ఆప్ష‌న్‌ ఎంచుకోవచ్చు
  9. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తు ఆమోదించడానికి ముందు అవసరమైన డాక్యుమెంటరీ ద్రువీక‌ర‌ణ‌ను నిర్వహించే అధికార పరిధి పన్ను విభాగానికి పంపబడుతుంది.
  10. 21 రోజుల్లో పన్ను అథారిటీ ఎటువంటి చర్యను ప్రారంభించకపోతే, రిజిస్ట్రేషన్ దరఖాస్తు ఆమోదించినట్లుగా పరిగణించ‌వ‌చ్చు.

ఈ స‌దుపాయాన్ని ఎలా పొందాలి?
www.gst.gov.in లాగాన్ త‌ర్వాత స‌ర్వీసెస్ సెక్ష‌న్‌లో రిజిస్ర్టేష‌న్‌పై క్లిక్ చేసి New Registration ఆప్ష‌న్ ఎంచుకోవాలి లేదా REGISTER NOW లింక్‌పై క్లిక్ చేయాలి. అక్క‌డ ఆధార్ అథెంటికేష‌న్ ఎంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని