GST: ‘మే’లో తగ్గిన జీఎస్టీ వసూళ్లు..

మే నెలలో కేంద్రానికి జీఎస్టీ రాబడి స్వల్పంగా తగ్గింది. జీఎస్టీ వసూళ్లు వరుసగా ఎనిమిదో నెల కూడా రూ.లక్ష కోట్ల మార్కును దాటినప్పటికీ గత వసూళ్లతో పోలిస్తే .....

Updated : 05 Jun 2021 17:25 IST

దిల్లీ: మే నెలలో కేంద్రానికి జీఎస్టీ రాబడి స్వల్పంగా తగ్గింది. జీఎస్టీ వసూళ్లు వరుసగా ఎనిమిదో నెల కూడా రూ.లక్ష కోట్ల మార్కును దాటినప్పటికీ గత వసూళ్లతో పోలిస్తే తగ్గుదల నమోదైంది. మే నెలకు గాను మొత్తంగా రూ.1,02,709 కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గతేడాది మే నెలతో పోలిస్తే రాబడిలో 65% వృద్ధి కనిపించినట్టు తెలిపింది. దీంట్లో వస్తువుల దిగుమతి నుంచి 56శాతం వసూళ్లు అధికంగా రాగా.. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం (సేవల దిగుమతి సహా) 69 శాతం గతేడాది కన్నా అధికంగా రాబడి ఉన్నట్టు పేర్కొంది. 

మే నెలలో మొత్తం జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్‌ జీఎస్టీ 17,592 కోట్లు కాగా.. రాష్ట్రాల జీఎస్టీ రూ.22,653 కోట్లు సమకూరినట్టు కేంద్రం ప్రకటనలో వెల్లడించింది. ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ రూపంలో రూ.53,199కోట్లు రాగా.. సెస్సుల రూపంలో రూ.9265 కోట్ల ఆదాయం సమకూరినట్టు పేర్కొంది. కరోనా కట్టడికి దేశంలోని అనేక రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లకు పైనే ఉందని ఆర్థికశాఖ పేర్కొంది. రూ.1.41లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లతో ఏప్రిల్‌ నెల ఆల్‌టైమ్‌ రికార్డుగా నిలిచిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని