GST: నవంబరు జీఎస్టీ వసూళ్లు రూ.1.31 లక్షల కోట్లు.. ఇదే రెండో అత్యధికం
జీఎస్టీ వసూళ్లు వరుసగా ఐదో నెలా రూ.లక్ష కోట్లను అధిగమించాయి. నవంబరు నెలలో రూ.1.31 లక్షల కోట్లు వసూలయ్యాయి....
దిల్లీ: జీఎస్టీ వసూళ్లు వరుసగా ఐదో నెలా రూ.లక్ష కోట్లను అధిగమించాయి. నవంబరులో రూ.1.31 లక్షల కోట్లు వసూలయ్యాయి. 2017 జులైలో జీఎస్టీని అమల్లోకి తెచ్చిన తర్వాత ఇదే రెండో అత్యధిక ఆదాయం.
నవంబరు నెలకుగానూ రూ.1,31,526 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థికశాఖ బుధవారం వెల్లడించింది. ఇందులో కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ) రూ.23,978 కోట్లు కాగా.. రాష్ట్రాల జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రూ.31,127 కోట్లు. సమ్మిళిత జీఎస్టీ (ఐజీఎస్టీ) కింద రూ.66,815 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.32,165 కోట్లతో కలిపి), సెస్ రూపంలో రూ.9,606 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.653 కోట్లతో కలిపి) వసూలైనట్లు ఆర్థికశాఖ తెలిపింది.
గత ఏడాది నవంబరుతో పోలిస్తే ఈ సారి జీఎస్టీ వసూళ్లు 25శాతం, 2019లో ఇదే నెలతో పోలిస్తే 27 శాతం పెరిగాయి. అంతేగాక, జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత మొత్తంలో పన్ను ఆదాయం రావడం ఇది రెండోసారని ఆర్థిక శాఖ తెలిపింది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందనడానికి ఇది నిదర్శనమని పేర్కొంది. అక్టోబరు 2021లో జీఎస్టీ ద్వారా రూ.1,30,127 కోట్ల ఆదాయం సమకూరిన విషయం తెలిసిందే. 2021 ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు ఆల్‌టైం రికార్డును తాకాయి. ఆ నెల రూ.1.41లక్షల కోట్లు వసూలయ్యాయి.
► Read latest Business News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్