GST Collection: మళ్లీ రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

జులై జీఎస్‌టీ వసూళ్లు మరోసారి రూ.లక్ష కోట్ల మైలురాయిని అధిగమించాయి. 2021 జులైలో ఇవి రూ.1,16,393 కోట్లుగా నమోదయ్యాయి. 2020 ఫిబ్రవరి నాటితో పోలిస్తే ఇవి 33 శాతం అధికం. వరుసగా ఎనిమిది....

Published : 01 Aug 2021 15:46 IST

దిల్లీ‌: జులై నెల జీఎస్‌టీ వసూళ్లు మరోసారి రూ.లక్ష కోట్ల మైలురాయిని అధిగమించాయి. 2021 జులైలో ఇవి రూ.1,16,393 కోట్లుగా నమోదయ్యాయి. 2020 జులై నాటితో పోలిస్తే ఇవి 33 శాతం అధికం. వరుసగా ఎనిమిది నెలల పాటు రూ.లక్ష కోట్లకు పైగా నమోదైన జీఎస్టీ వసూళ్లు.. 2021 జూన్‌లో రూ.92,849 కోట్లకు తగ్గిపోయిన విషయం తెలిసిందే.

జులై జీఎస్‌టీ వసూళ్లలో సీజీఎస్‌టీ రూ.22,197 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.28,541 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.57,864 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన పన్నులతో కలిపి), సెస్సులు రూ.7,790 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన సెస్సులతో కలిపి)గా ఉన్నాయి. రెగ్యులర్‌ సెటిల్‌మెంట్‌ కింద ఐజీఎస్‌టీ నుంచి సీజీఎస్‌టీ ఖాతాకు రూ.28,087 కోట్లు, ఎస్‌జీఎస్‌టీకి రూ.24,100 కోట్లను ప్రభుత్వం బదిలీ చేసింది. అనంతరం 2021 జులైలో కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం సీజీఎస్‌టీ కింద రూ.50,284 కోట్లు; ఎస్‌జీఎస్‌టీ కింద రూ.52,641 కోట్లుగా నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని