జనరల్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటులో మార్పులేదు

అంతకుముందు, ఏప్రిల్ నుంచి జూన్ 2021 వరకు ఇదే వడ్డీ రేటును ప్రభుత్వం ప్రకటించింది

Published : 06 Jul 2021 12:21 IST

2021-2022 ఆర్థిక సంవత్సరం జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్), ఇతర విరమణ పథకాలకు 7.1 శాతం వడ్డీ రేటును భారత ప్రభుత్వం ప్రకటించింది. పీపీఎఫ్ వ‌డ్డీ రేటు కూడా ప్ర‌స్తుతం 7.1 శాతంగానే ఉంది.

* అంతకుముందు, ఏప్రిల్ నుంచి జూన్ 2021 వరకు ఇదే వడ్డీ రేటును ప్రభుత్వం ప్రకటించింది

* వరుసగా ఆరో త్రైమాసికం జీపీఎఫ్ వ‌డ్డీరేటు 7.1 శాతం అవుతుంది. ఏప్రిల్ 2020 లో, కేంద్ర ప్రభుత్వం జీపీఎఫ్‌ వడ్డీ రేటును 7.9 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించింది.

కింది ప్రావిడెంట్ ఫండ్ పథకాలపై ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది:

1. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (సెంట్రల్ సర్వీసెస్)

2. కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్

3. ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రావిడెంట్ ఫండ్

4. స్టేట్ రైల్వే ప్రావిడెంట్ ఫండ్

5. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (డిఫెన్స్ సర్వీసెస్)

6. ఇండియన్ ఆర్డినెన్స్ డిపార్ట్‌మెంట్‌ ప్రావిడెంట్ ఫండ్

7. ఇండియా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ వర్క్‌మెన్స్ ప్రావిడెంట్ ఫండ్

8. ఇండియన్ నావల్ డాక్‌యార్డ్ వర్క్‌మెన్స్ ప్రావిడెంట్ ఫండ్

9. డిఫెన్స్ స‌ర్వీసెస్ ఆఫీస‌ర్స్ ప్రావిడెంట్ ఫండ్

10. సాయుధ దళాల సిబ్బంది ప్రావిడెంట్ ఫండ్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని