Geneva Motor Show: జనీవా మోటార్‌ షో రద్దు..

ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్‌ పరిశ్రమ కొవిడ్‌-19 సంబంధిత సమస్యలను ఎదుర్కొంటోంది. దీంతో ప్రఖ్యాత జెనీవా మోటార్‌ షోను వరుసగా మూడోసారి కూడా రద్దు చేశారు.

Published : 08 Oct 2021 21:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్‌ పరిశ్రమ కొవిడ్‌-19 సంబంధిత సమస్యలను ఎదుర్కొంటోంది. దీంతో ప్రఖ్యాత జెనీవా మోటార్‌ షోను వరుసగా మూడోసారి కూడా రద్దు చేశారు. ఈ మేరకు షో ఫౌండేషన్‌ కమిటీ నిర్ణయం తీసుకొంది. దీంతో ఫిబ్రవరిలో 2022 ఎడిషన్‌ను జరగదు. 2023 ఎడిషన్‌ మాత్రం షెడ్యూల్‌ ప్రకటించారు.

కార్లు, ఆటోమోటీవ్‌ పరిశ్రమలోని తయారీదార్ల హితాన్ని దృష్టిలో పెట్టుకొని 2022 షోను రద్దు చేసినట్లు కమిటీ పేర్కొంది. మరో మార్గం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ సంస్థలు, సందర్శకులు, జర్నలిస్టులు ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణ ఆంక్షలు ఎదుర్కోవడం ప్రధాన కారణమన్నారు. మరోపక్క కరోనా కారణంగా ప్రత్యక్ష, పరోక్ష ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. సెమీ కండక్టర్ల సమస్య తీవ్రంగా ఉందని వెల్లడించారు. వీటిని తొలుత పరిష్కరించాల్సి ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని