పింఛ‌నుదారులు... లైఫ్ స‌ర్టిఫికెట్ పొందండిలా!

లైఫ్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించేందుకు గ‌డువు స‌మీపిస్తుండ‌టంతో ఇంకా చేయ‌నివారు త్వ‌ర‌గా పూర్తిచేయ‌వ‌ల‌సి ఉంటుంది. అయితే దీని గురించి అంత ఆందోళ‌న అవ‌స‌రం లేదు. పింఛ‌నుదారులు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో ఈ సర్టిఫికెట్‌ను పొంద‌వ‌చ్చు. దేశంలో కోటి కుటుంబాల కంటే ఎక్కువ‌గా ప్ర‌భుత్వ పింఛ‌నుపై ఆధార‌ప‌డి..

Updated : 10 Oct 2021 21:41 IST

లైఫ్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించేందుకు గ‌డువు స‌మీపిస్తుండ‌టంతో ఇంకా చేయ‌నివారు త్వ‌ర‌గా పూర్తిచేయ‌వ‌ల‌సి ఉంటుంది. అయితే దీని గురించి అంత ఆందోళ‌న అవ‌స‌రం లేదు. పింఛ‌నుదారులు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో ఈ సర్టిఫికెట్‌ను పొంద‌వ‌చ్చు. దేశంలో కోటి కుటుంబాల కంటే ఎక్కువ‌గా ప్ర‌భుత్వ పింఛ‌నుపై ఆధార‌ప‌డి జీవిస్తున్నారు. మ‌రి వారంద‌రు న‌వంబ‌ర్ నెల‌లో త‌ప్ప‌నిస‌రిగా లైఫ్‌ స‌ర్టిఫికెట్ త‌మ బ్యాంకు శాఖ‌లో లేదా పోస్టాఫీసులో అందించాల్సి ఉంటుంది. బ్యాంకుకు వెళ్లేందుకు వీలులేని వారు దూర‌ప్రాంతాల్లో ఉన్న‌వారు ఆన్‌లైన్‌లో కూడా లైఫ్ స‌ర్టిఫికెట్ తీసుకోవ‌చ్చు. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత చాలామంది ప్ర‌భుత్వ రంగ ఉద్యోగులు ఇత‌ర ప్రాంతాల‌కు తిరిగి వెళ్తుంటారు. లైఫ్ స‌ర్టిఫికెట్ అనేది పింఛ‌నుదారుల‌కు చాలా ముఖ్యం. వారి కుటుంబ స‌భ్యుల వ‌ద్ద‌కు లేదా సొంత గ్రామాల‌కు చేరుకుంటారు. లైఫ్ స‌ర్టిఫికెట్ పొందేందుకు అనుస‌రించాల్సిన విధానం.

బ్యాంకు లేదా పోస్టాఫీస్‌లో లైఫ్ స‌ర్టిఫికెట్‌:

బ్యాంకు లేదా పోస్టాఫీస్ ద‌గ్గ‌ర‌గా ఉంటే నేరుగా వెళ్లి లైఫ్ స‌ర్టిఫికెట్ పొంద‌వ‌చ్చు. అదే దూర‌ప్రాంతాల్లోఉన్న‌ వారైతే లేదా వెళ్ల‌లేని స్థితిలో ఉంటే ఇంటి నుంచే డిజిట‌ల్ స‌ర్టిఫికెట్ పొంద‌వ‌చ్చు.

డిజిట‌ల్ లైప్ స‌ర్టిఫికెట్‌:

ఇత‌ర ప్రాంతాల్లో లేదా దూరంగా ఉన్న పింఛ‌నుదారులు ప్ర‌తి ఏడాది పెన్ష‌న్ ఏజెన్సీకి వ‌చ్చి ఈ స‌ర్టిఫికెట్ పొంద‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతోంది. ముఖ్యంగా వృద్ధుల‌కు ఇది వ్య‌య‌ప్ర‌యాస‌ల‌తో కూడుకున్న ప‌ని. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకే ప్ర‌భుత్వం జీవ‌న్ ప్ర‌మాణ్ పేరుత స‌ర్టిఫికెట్ జారీ చేసేందుకు డిజిట‌ల్‌ విధానాన్ని అమ‌ల్లోకి తెచ్చింది. దీంతో వారు హోమ్ బ్రాంచ్‌కి వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా బ‌యోమెట్రిక్ ద్వారా స‌ర్టిఫికెట్ పొంద‌వ‌చ్చు. అథెంటికేష‌న్ పూర్త‌యిన త‌ర్వ‌త డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికెట్ జ‌న‌రేట్ అవ‌తుంది. దీన్ని పెన్ష‌న్ ఏజెన్సీలు నిల్వ చేసుకుంటాయి.

జీవ‌న్ ప్ర‌మాణ్ ఆన్‌లైన్ జ‌న‌రేట్ చేసుకునేందుకు కంప్యూటర్ ఏల‌దా ఓఎస్ ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా పూర్తిచేయ‌వ‌చ్చు . అయితే బ‌యోమెట్రిక్ ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ అవ‌స‌రం. jeevanpramaan.gov.in/app/download ఈ లింక్ ద్వారా అప్లికేష‌న్ ఫారం డౌన్‌లోడ్ చేసుకోవాలి. త‌ర్వ‌త ఆధార్ వివ‌రాలు , పెన్ష‌న్ పే ఆర్డ‌ర్ (పీపీఓ), బ్యాంకు ఖాతా సంఖ్య‌, బ్యాంకు పేరు, మొబైల్ నంబ‌ర్ వంటి వివ‌రాల‌తో న‌మోదు చేసుకోవాలి. ఈ ప్రాసెస్ పూర్తి చేసేందుకు ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. అయితే మీ వ‌ద్ద స్కాన‌ర్‌ లేదా కంప్యూట‌ర్, మొబైల్ వంటి అవ‌స‌నమైన ప‌రిక‌రాలు లేకుంటే సిటిజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ (సీఎస్‌సీ) లేదా పోస్టాఫీస్‌, బ్యాంకు శాఖ‌ల‌కు వెళ్లి అస‌వ‌ర‌మైన వివ‌రాల‌ను అందించి డిజిటల్ లైఫ్ స‌ర్టిఫికెట్ పొంద‌వ‌చ్చు. మీకు ద‌గ్గ‌ర‌లోఉన్న సీఎస్‌సీ ఆఫీస్ వివ‌రాలను JPL పిన్‌కోడ్‌తో ఆధార్ ద్వారా ధ్రువీక‌ర‌ణ విజ‌య‌వంత‌మైతే డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికెట్ రూపొందుతుంది. ఇది రిపాజిట‌రీలోని రికార్డుల్లో భ‌ద్రంగా నిక్షిప్త‌మై ఉంటుంది. ఆధార్ అనుసంధానిత బ‌యోమిట్రిక్ ధ్రువీక‌ర‌ణ విజ‌య‌వంత‌మ‌య్యాక ఒక విశిష్ట కోడ్ జ‌న‌రేట్ అవుతుంది. దీన్నే ప్ర‌మాణ్ ఐడీగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ విధానం పూర్త‌యిన త‌ర్వాత మీకు జీవ‌న్ ప్ర‌మాణ్ ఐడీ తో కూడిన అక్నాలెడ్జ్‌మెంట్ వ‌స్తుంది. స‌ర్టిఫికెట్ పీడీఎఫ్ కూడా జీవ‌న్ ప్ర‌మాణ్ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని