Gold Rate: మరింతగా తగ్గిన బంగారం ధర

బంగారం ధర మరింతగా తగ్గింది. దేశ రాజధాని నగరం దిల్లీలో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై ఏకంగా రూ.1130లు (ఎంసీఎక్స్‌ రేటు ప్రకారం) తగ్గడంతో....

Updated : 17 Sep 2021 18:57 IST

దిల్లీ: బంగారం ధర భారీగా తగ్గింది. దేశ రాజధాని నగరం దిల్లీలో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.1,130లు తగ్గడంతో రూ.45,207(ఎంసీఎక్స్‌ రేట్ల ప్రకారం)కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు పతనం కావడంతో ఈ పరిణామం చోటు చేసుకున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. క్రితం ట్రేడింగ్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.46,226గా ఉంది.

మరోవైపు, వెండి ధరలు కూడా పసిడి బాటలోనే పయనించాయి. కిలో వెండి ధరపై శుక్రవారం రూ.708లు తగ్గడంతో ప్రస్తుతం మొత్తం ధర రూ.60,183కి చేరింది. నిన్నటి ట్రేడింగ్‌లో కిలో వెండి ధర రూ.60,891లుగా ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1762 అమెరికన్‌ డాలర్లు కాగా.. ఔన్సు వెండి ధర 22.95 డాలర్లుగా ట్రేడ్‌ అవుతోంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.47,620లుగా ట్రేడ్‌ అవుతుండగా.. కిలో వెండి ధర రూ.62,750లకు పైగా ట్రేడ్‌ అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని