3% తగ్గిన పసిడి దిగుమతులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-ఫిబ్రవరి మధ్య దేశంలోకి పసిడి దిగుమతులు 2,611 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2019-20 ఇదే సమయం నాటి పసిడి దిగుమతులు 2,700......

Published : 22 Mar 2021 22:39 IST

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-ఫిబ్రవరి మధ్య దేశంలోకి పసిడి దిగుమతులు 2,611 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2019-20 ఇదే సమయం నాటి పసిడి దిగుమతులు 2,700 కోట్ల డాలర్లతో పోలిస్తే ఈసారి 3.3 శాతం తగ్గాయి. ఇందువల్ల, దేశ వాణిజ్య లోటు 15,137 కోట్ల డాలర్ల నుంచి 8,462 కోట్ల డాలర్లకు పరిమితమైంది. వజ్రాభరణాల ఎగుమతులు 2020-21 ఏప్రిల్‌-ఫిబ్రవరిలో 33.86 శాతం క్షీణించి, 2,240 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పసిడి దిగుమతులు 530 కోట్ల డాలర్లకు చేరాయి. 2020 ఫిబ్రవరిలో ఇవి 236 కోట్ల డాలర్లే. వెండి దిగుమతులు 11 నెలల కాలంలో 70.3 శాతం తగ్గి, 7807.5 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.

ఇవీ చదవండి...

ఇప్పుడు బంగారంపై పెట్టుబడులు పెట్టొచ్చా?

అప్పుల ఊబిలో కుటుంబాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు