Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర!

బంగారం కొనాలనుకొనే వారికి శుభవార్త! గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్న 

Updated : 17 Jun 2021 17:19 IST

దిల్లీ: బంగారం కొనాలనుకొనే వారికి శుభవార్త! గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్న పసిడి ధర గురువారం భారీగానే దిగొచ్చింది. దేశ రాజధాని నగరం దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధరపై రూ.861లు తగ్గడంతో రూ.46,863కి చేరింది. క్రితం ట్రేడింగ్‌లో ఈ ధర రూ.47,742గా ముగిసింది. ప్రపంచ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలోనే ఈ తగ్గుదల కనిపించినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషించింది. మరోవైపు, వెండి ధరలు కూడా పసిడి బాటలోనే పయనించాయి. కిలో వెండిపై రూ.1709లు తగ్గడంతో 68,798గా ట్రేడ్‌ అవుతోంది.

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచుతుందన్న సంకేతాలకు తోడు డాలర్‌ విలువ మరింత బలపడటంతో పసిడి ధరలపై ప్రతికూల ప్రభావం పడినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ (కమోడటీస్‌) సీనియర్‌ విశ్లేషకుడు తపన్‌ పటేల్‌ తెలిపారు. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పసిడి ధర రూ.1810 డాలర్లుగా ఉండగా.. వెండి ధర రూ.26.89 డాలర్లుగా ట్రేడ్‌ అవుతోంది. ఇకపోతే, హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.49వేలకు పైగా ట్రేడవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని