భారీగా పెరిగిన బంగారం ధర 

బంగారం ధర మళ్లీ పెరిగింది. దేశ రాజధానిలో 10గ్రాముల పసిడిపై రూ.881లు పెరగడంతో .....

Updated : 01 Apr 2021 17:32 IST

దిల్లీ: బంగారం ధర మళ్లీ పెరిగింది. దేశ రాజధానిలో 10గ్రాముల పసిడిపై రూ.881లు పెరగడంతో ధర రూ.44701గా ఉంది. నిన్న 10 గ్రాముల బంగారం రూ.43,820గా పలికింది. వెండి కూడా అదే బాటలో పయనించింది. కిలో వెండిపై రూ.1071లు పెరగడంతో దాని ధర 63,256కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1719 అమెరికా డాలర్లు, ఔన్సు వెండి ధర 24.48 డాలర్లుగా ట్రేడవుతోంది. 

మరోవైపు, పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 10గ్రాముల బంగారం ధర రూ.500లకు పైగా పెరగడంతో రూ.46,370(పన్నులతో కలిపి)గా ఉంది. అలాగే, కిలో వెండి ధర రూ.65,969గా ఉంది. ప్రపంచ మార్కెట్లో లోహధరలు పెరగడం వల్లే ధరలు పెరిగినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మదుపరులు బంగారంపై పెట్టుబడిని సురక్షితంగా భావిస్తున్న నేపథ్యంలో ఈ ధరలు పెరిగినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని