సంయుక్తంగా టోకనైజేషన్ ను విడుదల చేసిన గూగుల్, మాస్టర్ కార్డు..

వినియోగదారులు తమ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలైన కార్డు నెంబర్, ఎక్స్‌పైరీ డేట్ వంటి వాటి అవసరం లేకుండానే టోకనైజేషన్ ద్వారా సురక్షితమైన డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు

Updated : 21 Dec 2021 14:58 IST

ఆన్ లైన్ లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చేందుకు భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) టోకనైజేషన్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా గూగుల్, మాస్టర్ కార్డు సంయుక్తంగా తమ వినియోగదారులు వారి క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి సురక్షితంగా లావాదేవీలు జరిపేందుకు వీలు కల్పించే టోకనైజేషన్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించాయి. వినియోగదారులు తమ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలైన కార్డు నెంబర్, ఎక్స్‌పైరీ డేట్ వంటి వాటి అవసరం లేకుండానే టోకనైజేషన్ ద్వారా సురక్షితమైన డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు.

గూగుల్ పే ఆండ్రాయిడ్ వినియోగదారులు తమ మాస్టర్ కార్డు డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా భారత్ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం, అలాగే యాప్‌లో లావాదేవీలు చేయడం వంటి వాటిని సురక్షితంగా చేయవచ్చునని సంస్థ ప్రకటనలో తెలిపింది. దీని కోసం వినియోగదారులు గూగుల్ పే యాప్‌లో తమ కార్డు వివరాలను నమోదు చేసి, అనంతరం ఓటీపీని ఎంటర్ చేసి వన్-టైమ్ సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు