Work from home: వర్క్‌ ఫ్రమ్‌ హోం సదుపాయాన్ని పొడిగించిన గూగుల్‌!

ఇంటి నుంచి పని (వర్క్‌ ఫ్రమ్‌ హోం) సదుపాయాన్ని వచ్చే ఏడాది వరకు పొడిగిస్తున్నట్లు టెక్‌ దిగ్గజం గూగుల్‌ ప్రకటించింది....

Updated : 01 Sep 2021 13:47 IST

ఎప్పటి వరకంటే..?

శాన్‌ఫ్రాన్సిస్కో: ఇంటి నుంచి పని (వర్క్‌ ఫ్రమ్‌ హోం) సదుపాయాన్ని వచ్చే ఏడాది వరకు పొడిగిస్తున్నట్లు టెక్‌ దిగ్గజం గూగుల్‌ ప్రకటించింది. గూగుల్‌ క్యాంపస్‌లకు తిరిగి వచ్చే విషయంలో ఉద్యోగులకు జనవరి 10 వరకు స్వేచ్ఛనిస్తున్నామని సంస్థ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ వెల్లడించారు. అలాగే ఉద్యోగులను కార్యాలయాలకు పిలిపించుకునే విచక్షణాధికారాన్ని స్థానిక ఆఫీసులకు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చాలా కార్యాలయాల్లో బిజినెస్ ఊపందుకుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా క్యాంపస్‌లకు తరలివచ్చే గూగుల్‌ ఉద్యోగులకు స్వాగతం పలుకుతున్నామన్నారు. రానున్న రోజులు ఊహించినదాని కంటే కొంత భిన్నంగా గడిచే అవకాశాలు ఉన్న్పటికీ.. వచ్చే సవాళ్లకు సమష్టిగా ఎదుర్కొనే సామర్థ్యం గూగుల్‌కు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కచ్చితంగా ఆఫీసులకు రావాలని కనీసం ఒక నెల రోజుల ముందే తెలియజేస్తామని ఉద్యోగులకు పిచాయ్‌ హామీ ఇచ్చారు. విశ్రాంతి కోసం డిసెంబరు, అక్టోబరులో కావాలంటే ఒక రోజు అదనంగా సెలవు తీసుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్‌ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో పలు సంస్థలు వర్క్‌ ఫ్రమ్‌ సదుపాయాన్ని పొడిగిస్తున్నాయి. ఫేస్‌బుక్‌ ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం తీసుకోగా.. తాజాగా గూగుల్‌ సైతం అదే బాటలో పయనించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని