బడ్జెట్‌లో రెండో ‘ఉదయ’మ్‌‌..!

ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌లో విద్యుత్త సరఫరాపై దృష్టి సారించనుంది. భారత్‌ను ఉత్పాదక కేంద్రంగా మార్చాలంటే విద్యుత్తు రంగం బలంగా ఉండటం చాలా ముఖ్యం. పారిశ్రామిక రంగానికి అవసరమైన మౌలిక వనరుల్లో ఇదే కీలకమైంది. చాలా దేశాల అభివృద్ధిని విద్యుత్తు వినియోగం ఆధారంగా అంచనా వేస్తుంటారు.

Updated : 01 Feb 2021 10:41 IST

 డిస్కమ్‌ల పటిష్టతకు చర్యలు అవసరం

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌లో విద్యుత్త సరఫరాపై దృష్టి సారించనుంది. భారత్‌ను ఉత్పాదక కేంద్రంగా మార్చాలంటే విద్యుత్తు రంగం బలంగా ఉండటం చాలా ముఖ్యం. పారిశ్రామిక రంగానికి అవసరమైన మౌలిక వనరుల్లో ఇదే కీలకమైంది. చాలా దేశాల అభివృద్ధిని విద్యుత్తు వినియోగం ఆధారంగా అంచనా వేస్తుంటారు. దేశంలోని అందరికీ 24 గంటలూ విద్యుత్తు సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్నట్లు సమాచారం. ఇందుకోసం పంపిణీ సంస్థలను బలోపేతం చేయాల్సి ఉంది. ప్రస్తుతం చాలా డిస్కమ్‌లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఇవి పుంజుకొనేలా చేసేందుకు ఈ సారి బడ్జెట్‌లో సరికొత్తగా ఉదయ్‌-2 స్కీంను ప్రవేశపెట్టే అవకాశాలునట్లు వార్తలొస్తున్నాయి.

ప్రభుత్వం తొలిసారిగా 2015లో ఉదయ్‌(ఉజ్వల డిస్కమ్‌ అస్యూరెన్స్‌ యోజన)ను ప్రవేశపెట్టింది. అప్పుల్లో కూరుకుపోయిన డిస్కమ్‌లను ఆదుకొనేందుకు దీనిని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద ఒప్పందాలపై సంతకాలు చేసి విద్యుత్తు పంపిణీ సంస్థలు మూడేళ్లలో తిరిగి పుంజకొనేలా చేయడం దీని లక్ష్యం. 

2019 సెప్టెంబర్‌లో విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ మాట్లాడుతూ.. తమ శాఖ ఉదయ్‌2.0పై పనిచేస్తోందని వెల్లడించారు. 2020-21 బడ్జెట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంచనావేశారు.  ఆ బడ్జెట్‌ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ మాట్లాడుతూ ..ప్రతి గృహానికి విద్యుత్తును అందించడం వంటి బృహత్తర లక్ష్యాన్ని తాకేందుకు వీలుగా డిస్కమ్‌లు లేవని తెలిపారు. వీటిని సరిచేసేందుకు అవసరమైన సంస్కరణలు చేపడతామని చెప్పారు.  కానీ ఎటువంటి ప్రతిపాదనలను వెల్లడించలేదు. 

ఉదయ్‌ పథకం అమలు చేసిసన కొన్నిటి పరిస్థితి మారగా.. మరికొన్ని సంస్థ ఆర్థిక పరిస్థితిలో మార్పు రాలేదు. ఉదయ్‌ పథకంలో పేర్కొన్న సంస్కరణలను అమలు చేయకపోవడమే దీనికి కారణం. 

విద్యుత్తు ఉత్పత్తి ధర కంటే విక్రయించే ధర తక్కువగా ఉండటం, సబ్సిడీలకు తగిన బడ్జెట్‌ కేటాయించకపోవడం, వాణిజ్య, సాంకేతిక నష్టాలు కొనసాగటం దీనికి కారణమని కేంద్రం అధికారిక ప్రకటనలో పేర్కొంది. నవంబర్‌ 2020 నాటికి డిస్కమ్‌లో జెన్‌కోలకు చెల్లించాల్సిన మొత్తం రూ.1.39లక్షల కోట్లకు చేరింది. వీటిల్లో రూ. 1.29 లక్షల కోట్లు ఓవర్‌ డ్యూలుగా ఉన్నాయి. జెన్‌కోలకు చెల్లించాల్సిన గడువు దాటిన 45 రోజులు తర్వాత బకాయిలను ఓవర్‌ డ్యూలుగా భావిస్తారు.  అంటే డిస్కమ్‌లకు  ఏ స్థాయిలో నగదు కొరత ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం గతేడాది డిస్కమ్‌లకు తొలుత రూ.90 వేల కోట్లతో ప్యాకేజీ ప్రకటించినా.. ఆ తర్వాత దానిని రూ.1.20లక్షల కోట్లను విస్తరించింది.  

దీంతో రాష్ట్రాల్లో వివిధ శాఖలు భారీగా బిల్లులను బకాయిలను వెంటనే చెల్లించడంతోపాటు.. నెలవారీ సమయానికి బిల్లు కట్టేలా చేయాని పేర్కొంది. దీంతోపాటు కచ్చితమైన ఎనర్జీ అకౌంటింగ్‌ విధానాలను పాటించాలని కోరింది. దీంతోపాటు సాధారణ మీటర్లను మూడేళ్లలో స్మార్ట్‌మీటర్లుగా మార్చేయాలని సూచించింది.  

* స్మార్ట్‌ గ్రిడ్లను ఏర్పాటు చేయిలి. 

* విద్యుత్తు చట్ట సవరణలను అమలు చేసి వేగంగా వివాదాలను పరిష్కరించే వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. 

* వ్యవయాలను తట్టుకొనే విధంగా ధరలను నిర్ణయించడం, దీంతోపాటు మరింత చౌకగా చౌకగా పంపిణీ వ్యవస్థలను నిర్వహించేలా చూసుకోవాలి. 

* ఈ చర్యలతో పాటు పన్నుల్లో ఊరట, పెట్టుబడుల ఉపసంహరణ, నిధుల సమీకరణకు మరిన్ని అవకాశాలు వంటి కల్పించాలి. అప్పుడే ఈ వ్యవస్థ  కొత్త ప్రాజెక్టులపై దృష్టిపెట్టే అవకాశాలు ఉన్నాయి. 

ఇవీ చదవండి

బడ్జెట్‌.. నిర్మలమ్మ ముందు సవాళ్లెన్నో..

సొంతింటి కలకు.. గడువు పెంచుతారా?
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని