Provident Fund: పీఎఫ్‌పై 8.5శాతం వడ్డీకి కేంద్రం ఓకే..!
2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ ఉద్యోగుల భవిష్యనిధి(ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్-ఈపీఎఫ్)పై 8.5శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు
దిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ ఉద్యోగుల భవిష్యనిధి(ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్-ఈపీఎఫ్)పై 8.5శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. దీనిపై త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్‌పై 8.5శాతం చొప్పున వడ్డీ జమ చేయాలని ఈ ఏడాది మార్చిలోనే ఈపీఎఫ్‌వో నిర్ణయ మండలి కేంద్ర ధర్మకర్తల బోర్డు ప్రతిపాదించింది. ఇందుకు కార్మిక శాఖ కూడా సమ్మతించింది. తాజాగా ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థికశాఖ నుంచి ఆమోదం లభించినట్లు సదరు వర్గలు పేర్కొన్నాయి. 5కోట్లకు పైగా ఈపీఎఫ్ చందాదారులకు త్వరలోనే ఈ వడ్డీని జమ చేసే అవకాశాలున్నట్లు తెలిపాయి.
గత ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌పై 8.5శాతం వడ్డీరేటు.. ఏడేళ్లలో ఇదే కనిష్ఠం కావడం గమనార్హం. 2018-19, 2016-17లో 8.65శాతం చొప్పున వడ్డీ జమ చేయగా.. 2013-14, 2014-15లో 8.75శాతం చొప్పున ఇచ్చారు. 2015-16లో 8.8శాతం చొప్పున జమచేశారు. అయితే కొవిడ్ సమయంలో విత్‌డ్రాలు పెరగడం, చందాదారుల నుంచి జమయ్యే సొమ్ము తగ్గిపోవడంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీని 8.5శాతానికి తగ్గించారు. ఈ దఫా కూడా వడ్డీరేటును తగ్గించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చినా.. 8.5శాతం చొప్పున వడ్డీ జమ చేసేందుకు కేంద్రం అంగీకరించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Delhi Liquor Scam: 8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ
-
World News
Donald Trump: ట్రంప్ అరెస్టైతే.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చా..?
-
Politics News
CM KCR: భారాస శ్రేణులకు సీఎం కేసీఆర్ ‘ఆత్మీయ సందేశం’
-
Movies News
బ్యాంకింగ్ సంక్షోభం వల్ల నా డబ్బు సగం పోయింది: నటి
-
Sports News
Gambhir: మాజీ ఆటగాళ్లకు మసాలా అవసరం.. కేఎల్ రాహుల్‌కు మద్దతుగా నిలిచిన గంభీర్
-
India News
Amritpal Singh: విదేశాల నుంచి రూ.35 కోట్లు.. పాక్‌కు కాల్స్..!