2 ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ.. ఈ సమావేశాల్లోనే బిల్లు!

ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేసే బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది...

Updated : 22 Aug 2022 17:03 IST

దిల్లీ: ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేసే బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మొత్తం 26 బిల్లుల్లో బ్యాంకింగ్‌ చట్టసవరణ బిల్లు కూడా ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేసేందుకుగానూ 1970, 1980 బ్యాంకింగ్ కంపెనీల చట్టంతో పాటు 1949 బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌కు సవరణలు చేయడమే బిల్లు ఉద్దేశమని పేర్కొన్నాయి. బిల్లు ప్రవేశ పెట్టడం, పరిశీలన, ఆమోదం కోసం లిస్టయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ సహా పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.లక్షా 75 వేల కోట్లు సమీకరించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2021-22 బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో మరో కీలకమైన పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ చట్ట సవరణ బిల్లు కూడా ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని