కిరాణా దుకాణాలు ఆన్‌లైన్‌లో

చిన్న వ్యాపార సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆన్‌లైన్‌లో తమ వ్యాపారాన్ని నిర్వహించేందుకు వీలుగా వెబ్‌స్టోర్‌ సేవలు అందిస్తున్నట్లు షాప్‌మేటిక్‌ సహవ్యవస్థాపకుడు అనురాగ్‌ ఆవుల తెలిపారు.

Updated : 08 Jun 2021 08:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: చిన్న వ్యాపార సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆన్‌లైన్‌లో తమ వ్యాపారాన్ని నిర్వహించేందుకు వీలుగా వెబ్‌స్టోర్‌ సేవలు అందిస్తున్నట్లు షాప్‌మేటిక్‌ సహవ్యవస్థాపకుడు అనురాగ్‌ ఆవుల తెలిపారు. కిరాణా దుకాణదార్లు, తమ వద్ద లభించే సరకుల వివరాలతో సొంతంగా వెబ్‌ స్టోరు సిద్ధం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆగస్టు 31 వరకు రుసుము లేకుండానే ఈ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో విక్రయించిన వస్తువుల బిల్లుపై 3 శాతం తాము సేవా రుసుముగా తీసుకుంటామని పేర్కొన్నారు. అన్ని రకాల చిరు వ్యాపారులు తమ సేవలు వినియోగించుకోవచ్చన్నారు.

అంకురాల్లో పెట్టుబడులకు ట్రిపుల్‌ఐటీ-సక్సీడ్‌ భాగస్వామ్యం
ఈనాడు, హైదరాబాద్‌: కృత్రిమ మేధ, ఇతర ఇంజినీరింగ్‌ సాంకేతికతల రంగంలో పనిచేస్తున్న అంకురాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఐఐఐటీ హైదరాబాద్‌, వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ సక్సీడ్‌ ఇండోవేషన్‌ ఫండ్‌ చేతులు కలిపాయి. తొలి దశలో ఉండి, ఇంకా ఆదాయాన్ని ఆర్జించని అంకురాలకు పెట్టుబడుల మద్దతు అందిస్తారు. దీనికింద ఎంపిక చేసిన సంస్థలకు రూ.40లక్షల వరకు నిధులు లభిస్తాయి. సీఐఈ-ఐఐఐటీహెచ్‌ సీఈఓ ప్రొఫెసర్‌ సీవీ జవహర్‌ మాట్లాడుతూ.. తొలి దశలో ఉన్న డీప్‌టెక్‌ అంకురాలకు నిధులు లభించడం ప్రస్తుతం ఇబ్బందిగా మారిందన్నారు. సక్సీడ్‌ భాగస్వామ్యంతో ఇలాంటి సంస్థలకు పెట్టుబడులు సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమికంగా భారత్‌ నుంచి వచ్చిన సాంకేతిక సంస్థల్లోనే పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నట్లు సక్సీడ్‌ ఇండోవేషన్‌ ఫండ్‌ సహ వ్యవస్థాపకుడు విక్రాంత్‌ వర్షిణి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని