హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం రూ.8,186 కోట్లు

మార్చితో ముగిసిన త్రైమాసికంలో దేశీయ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ మెరుగైన ఫలితాల్ని సాధించింది. స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన బ్యాంక్‌ నికరలాభం 18 శాతం పెరిగి రూ.8,186 కోట్లుగా నమోదైంది.....

Updated : 17 Apr 2021 17:26 IST

ముంబయి: మార్చితో ముగిసిన త్రైమాసికంలో దేశీయ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ మెరుగైన ఫలితాల్ని సాధించింది. స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన బ్యాంక్‌ నికరలాభం 18 శాతం పెరిగి రూ.8,186 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభం రూ.6,927.6 కోట్లుగా ఉంది. అయితే, క్రితం త్రైమాసికంతో పోలిస్తే స్టాండ్‌ఎలోన్‌ నికర లాభంలో 6.5 శాతం క్షీణత కనిపించింది. 

నికర వడ్డీ ఆదాయం కూడా 12.5 శాతం పెరిగి రూ. 17,120 కోట్లకు చేరింది. జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.24,713 కోట్లుగా నమోదైంది. వడ్డీయేతర ఆదాయం 26 శాతం పెరిగి రూ.7,593 కోట్లుగా రికార్డయింది. స్థూల నిరర్ధక ఆస్తులు 0.81 శాతం (డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో) నుంచి 1.32 శాతానికి పెరిగాయి. ఇక నికర నిరర్ధక ఆస్తులు 0.40 శాతంగా నమోదయ్యాయి. 

కరోనా నేపథ్యంలో థర్డ్‌ పార్టీ ఉత్పత్తుల విక్రయాలు తగ్గాయని.. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వినియోగం సైతం తగ్గిందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. అలాగే కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఎలాంటి డివిడెండు ప్రకటించొద్దని బోర్డు నిర్ణయించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని