HDFC Credit card: నెలకు 3 లక్షల క్రెడిట్‌ కార్డుల విక్రయమే లక్ష్యం!

కొత్త క్రెడిట్‌ కార్డులు విక్రయించకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై విధించిన నిషేధాన్ని ఆర్‌బీఐ ఎత్తివేయడంతో.. తిరిగి ఈ విభాగంలో పూర్వవైభవాన్ని సాధించేందుకు....

Published : 23 Aug 2021 18:01 IST

ముంబయి: కొత్త క్రెడిట్‌ కార్డులు విక్రయించకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై విధించిన నిషేధాన్ని ఆర్‌బీఐ ఎత్తివేయడంతో.. తిరిగి ఈ విభాగంలో పూర్వవైభవాన్ని సాధించేందుకు సంస్థ చర్యలు చేపట్టింది. నెలకు మూడు లక్షల క్రెడిట్‌ కార్డుల విక్రయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని కంపెనీ పేమెంట్స్‌ విభాగాధిపతి పరాగ్‌ రావు వెల్లడించారు. మూడు నెలల్లో ఈ లక్ష్యాన్ని అందుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం రెండు త్రైమాసికాల్లో నెలకు ఐదు లక్షల కార్డుల విక్రయాన్ని టార్గెట్‌గా నిర్దేశిస్తామన్నారు. ఇలా ఇప్పటి నుంచి రానున్న నాలుగు త్రైమాసికాల్లో కార్డుల విభాగంలో మార్కెట్‌ షేర్‌ పరంగా తిరిగి అగ్రగామిగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కొత్త క్రెడిట్‌ కార్డులు విక్రయించకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై విధించిన నిషేధాన్ని ఆర్‌బీఐ ఇటీవలే ఎత్తివేసింది. కొత్త టెక్నాలజీలు తీసుకురావడంపై మాత్రం నిషేధం కొనసాగుతోంది. గతేడాది డిసెంబరులో పలు మార్లు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో క్రెడిట్‌ కార్డుల విభాగంలో అగ్రగామిగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై కొత్త కార్డులు జారీ చేయకుండా ఆర్‌బీఐ నిషేధం విధించింది. దీంతో మార్కెట్‌ షేరులో హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల వాటా రెండు శాతం తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని