HDFC Bank Festive Offers: రుణాలు, కొనుగోళ్లపై హెచ్‌డీఎఫ్‌సీ పండగ ఆఫర్లు!

ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ మరిన్ని పండుగ ఆఫర్లను ప్రకటించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో 10 వేల వ్యాపార సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకొంది...

Published : 05 Oct 2021 21:19 IST

ముంబయి: ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ మరిన్ని పండుగ ఆఫర్లను ప్రకటించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో 10 వేల వ్యాపార సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకొంది. వీటిలో యాపిల్‌, అమెజాన్‌, షాపర్స్‌ స్టాప్‌, ఎల్‌జీ, శాంసంగ్‌, సోనీ, టైటన్‌, సెంట్రల్‌ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. దీంతో వినియోగదారులకు ప్రత్యేకంగా వారికి అవసరమయ్యే ఆఫర్లను అందజేసేందుకు అవకాశం ఏర్పడుతుందని హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది. క్రెడిట్‌, డెబిట్‌, ప్రీపెయిడ్‌ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై ఈ ఆఫర్లు వర్తిస్తాయని వివరించింది.

ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి..

* ప్రీమియం మొబైల్‌ ఫోన్లపై క్యాష్‌బ్యాక్‌, నో కాస్ట్‌ ఈఎంఐ.

* వాషింగ్ మెషీన్‌, రిఫ్రిజిరేటర్‌ వంటి ఎలక్ట్రానిక్స్‌, కన్జ్యూమర్‌ గూడ్స్‌పై 22.5 శాతం క్యాష్‌బ్యాక్‌తో పాటు నో కాస్ట్‌ ఈఎంఐ.

* 10.25 శాతం వడ్డీరేటుతో వ్యక్తిగత రుణం.

* 7.50 శాతం వడ్డీరేటుతో కారు రుణం. ఎలాంటి ఫోర్‌క్లోజర్‌ రుసుములు ఉండవు.

* నాలుగు శాతం తక్కువ వడ్డీరేటుతో ద్విచక్రవాహనాలకు కావాల్సిన మొత్తం రుణరూపంలో మంజూరు.

* జీరో ప్రాసెసింగ్‌ ఫీజుతో ట్రాక్టరుకు కావాల్సిన మొత్తంలో 90 శాతం రుణరూపంలో మంజూరు.

* వాణిజ్య వాహనాలకు కావాల్సిన రుణాల ప్రాసెసింగ్‌ ఫీజులో 50 శాతం రాయితీ.

* ఎలాంటి తనఖా లేకుండా 75 లక్షల వరకు వ్యాపార రుణాలు. అలాగే ప్రాసెసింగ్‌ ఫీజులో 50 శాతం రాయితీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని